Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది

by Anji

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. వృషభ రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. 

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  శనివారం జనవరి 06, 2024న ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  06.01.2024: మేషం

వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బంధు, మిత్రులతో సక్యతగా వ్యవహరిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడిలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Today rashi phalau in telugu :  సింహం

వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాల్లో అకస్మిక మార్పులుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

 

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పాత స్నేహితులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగాల్లో అకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

చిన్నప్పటి స్నేహితులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చడానికి రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

నిరుద్యోగులకు కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యాపారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : కుంభం

చిన్నప్పటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, వ్యాపారాలు కాస్త నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు తప్పవు. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading