రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
మధ్యమ ఫలితాలున్నాయి. మీ నిజాయితీ మిమ్మల్నీ కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి.
Today rashi phalau in telugu : వృషభం
ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడుతాయి. బంధు, మిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : మిథునం
సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : సింహం
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
Today rashi phalau in telugu : తుల
పలు రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఓ ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఓ వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది.
Today rashi phalau in telugu : ధనస్సు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాట్లకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారతో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.
Today rashi phalau in telugu : కుంభం
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Today rashi phalau in telugu : మీనం
ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభంచాలి.