Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని జ‌యిస్తారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని జ‌యిస్తారు

by Anji
Published: Last Updated on
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 01.07.2022: మేషం

 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను కుటుంబ స‌భ్యుల అంగీకారం త‌రువాత‌నే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభ‌వార్త వింటారు. శ‌త్రువుల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

కార్య‌సిద్ధి ఉంది. దైవ‌బ‌లంతో ఒక ప‌నిని పూర్తి చేస్తారు. ప్రారంభించిన ప‌నుల‌ను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. క్ష‌మాగుణంతో ఉంటే మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

ఎంత శ్ర‌మిస్తారో అంతే ఫ‌లితాన్ని సాధిస్తారు. ఒక వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణ‌యాలు గొప్ప ఫ‌లితాన్నిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కాలం శుభ‌ప్ర‌దంగా గ‌డుస్తుంది. మాన‌సికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. మ‌నఃసౌఖ్యం ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో ఒత్తిడిని జ‌యించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్న‌వారు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశ‌ముంది. కీల‌క విష‌యంలో ముందుగానే స్పందించండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన ప‌నిలో సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తారు. స‌మ‌యానికి సాయం చేస్తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఖ‌ర్చులు పెర‌గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మంచి ఫ‌లితాలు ఉంటాయి. ఆర్థికంగా సానుకూలం. అదృష్ట‌వంతులు అవుతారు. నూత‌న వ‌స్తువులు కొంటారు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వ్య‌యం పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. కొన్ని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి. అభివృద్ధి సాధించే అంశాల్లో స్ప‌ష్ట‌త అవ‌స‌రం. ప్రశాంత‌మైన వాతావ‌ర‌ణం క‌ల‌దు.

Today rashi phalau in telugu : ధనస్సు

తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోకండి.ఒక వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చిత్త‌శుద్ధితో ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఓ శుభ‌వార్త మాన‌సిక ప్ర‌శాంత‌తను క‌లిగిస్తుంది. ఆర్థిక వ్య‌వ‌హారాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌ను క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హ‌కారముంటుంది. ఒక శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో స‌మ‌యానుకూలంగా స్పందించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన ప‌నిలో ఆలోచ‌న‌లు మార‌కుండా చూసుకోవాలి. కొన్ని వ్య‌వ‌హారాల్లో మ‌నోధైర్యం కీల‌క పాత్ర పోషిస్తుంది. ఎట్టిప‌రిస్థితిలోనూ నిర్ల‌క్ష్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Visitors Are Also Reading