Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఎవ‌రితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవ‌ద్దు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఎవ‌రితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవ‌ద్దు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.08.2022: మేషం

బాగా క‌ష్ట‌ప‌డాల్సిన స‌మ‌యం ఇది. మీ మీ రంగాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. అవ‌గాహ‌న వ‌చ్చిన త‌రువాతే ప‌నుల‌ను ప్రారంభించాలి. ల‌క్ష్యాన్ని చేరుకునే వ‌రకు పట్టు వ‌ద‌ల‌కండి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అల‌సట పెర‌గ‌కుండా చూసుకోవాలి. శ‌త్రువుల విష‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu: మిథునం

శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. గొప్ప భ‌విష్య‌త్ కోసం మంచి ఆలోచ‌న‌లు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు శుభ‌కాలం. కీల‌క స‌మ‌యాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించారు. అవ‌స‌ర విష‌యాల గురించి ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్చించ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆశ‌యాలు నెర‌వేరుతాయి. స‌మ‌యానికి బుద్ధిబ‌లం ప‌ని చేస్తుంది. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ ఇవ్వండి. భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. స‌మాజంలో కీర్తి పెరుగుతుంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ముందుకు సాగ‌డం మేలు.

Today rashi phalau in telugu : సింహం

కీల‌క లావాదేవీల్లో సొంత నిర్ణ‌యాలు విక‌టిస్తాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ఆటంకాలు ఎదుర‌వుతాయి. చెడు త‌లంపులు వ‌ద్దు. కీల‌క విష‌యాల్లో నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. ప్ర‌శాంతంగా ఆలోచించ‌డం మంచిది. విష్ణు సంద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మ‌ద్య‌మ ఫ‌లితాలున్నాయి. అదికారుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. బంధు, మిత్రుల‌తో మాట్లాడేట‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఓ సంఘ‌ట‌న మ‌న‌స్థాపాన్ని క‌లిగిస్తుంది. ఎలాంటి ప‌రిస్థితిలోనూ దైవారాధ‌న మాన‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మ‌నోబ‌లంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహ‌క‌రమైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి. ఎవ‌రితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవ‌ద్దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

విజ‌య‌సిద్ధి ఉంది. ధ‌ర్మసిద్ధి ఉంది. కీల‌క వ్య‌వ‌హారాల విష‌యంలో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివి తేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభం చేకూర్చుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మ‌నోబ‌లాన్ని కోల్పోవ‌ద్దు. మంచి ప‌నులు త‌ల‌పెడ‌తారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. కుటుంబ వాతావ‌ర‌ణం అంతా అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ముఖ్య వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మంచి చేయ‌బోతే చెడు అవుతుంది. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మంచి ఫ‌లితాలున్నాయి. కొత్త ప‌నులు ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. బందు, మిత్రుల ఆద‌ర‌ణ త‌ప్ప‌నిసరి.

Today rashi phalau in telugu :  మీనం

ఒక ముఖ్య‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు. బాద్య‌త‌లు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాల‌ని చూసేవారి ప్ర‌య‌త్నాలు వృథా ప్ర‌యాసాలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Visitors Are Also Reading