Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో లాభం పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రతిఫలాలు ఉంటాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu  14.02.2024: మేషం

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశముంది. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పై అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. 

Today rashi phalau in telugu : మిథునం

స్థిర నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మీ యొక్క ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

అవసరానికి డబ్బు అందుతుంది. ప్రారంభించబోయే పనులు అనుకున్న దాని కంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయోచితంగా స్పందించండి.

Today rashi phalau in telugu : తుల

ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

మీ మీ రంగాల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులుంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఆర్థిక సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఓ సంఘటన కనువిప్పు కలిగిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులను మధ్యాహ్న కాలంలో ప్రారంభించండి. అనుకూల ఫలితాలు సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన పనులను కొద్దిరోజుల పాటు వాయిదా వేయడం ఉత్తమం. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading