ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలకు ఈ మధ్య రేటింగ్ చాలా తగ్గిందనే చెప్పాలి. ప్రైమ్ టైమ్‌లో టెలికాస్ట్ అయ్యే షోలో ఎక్కువగా జబర్దస్త్, ఢీ, క్యాష్ షోలను మాత్రమే జనాలు ఆదరిస్తున్నారు. ఇక ఆ తరువాత స్థానంతో ఆలీతో సరదాగా షోను కూడా ప్రస్తుతం జనాలు అంతంత మాత్రంగానే చూస్తున్నారు. సాయికుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వావ్ షోకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు వావ్ షో వస్తుందని చాలా మంది మరిచిపోయారు.
Advertisement
ఇలాంటి పరిస్థితిలో ఈటీవీలో ప్రసారమయ్యే ఆటీతో సరదాగా టాక్ షో పరిస్థితి ఏమిటి అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదిగో అదిగో అంటూ ఈవీలో షోల రేటింగ్ విషయంలో గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం షోకు రేటింగ్ తగ్గిపోవడంతో నిర్వాహకులకు ఏమి చేయాలో అర్థం కావడం లేదట. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు ఎపిసోడ్‌ల రేటింగ్ తగ్గడంతో ఈటీవీ రేటింగ్ పడిపోతుంది. మరొకవైపు ఆలీతో సరదాగా రేటింగ్ కూడా తగ్గిందని స్పష్టమవుతోంది. ఇదివరకు ఉన్న రేటింగ్ ప్రస్తుతం ఉన్న రేటింగ్ పోల్చి చూస్తే ఈ షోను చూస్తున్న వారి సంఖ్య దాదాపు 32 శాతం తగ్గిందట.
Advertisement
వాస్తవానికి ఈ సంఖ్య అంత చిన్నది ఏమి కాదు. ఈ షోకు వస్తున్న ఆదాయంలో దాదాపు సగం వరకు కోల్పోవడంతో ఇక షో రన్ చేయడం ఎలా అంటూ నిర్వాహకులు తల పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. స్పాన్సర్స్ రాకపోవడంతో ఆలీ తో సరదాగా షో ను ముగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఏకంగా ముగిస్తున్నారనే కొంత మంది రుమార్స్ కూడా క్రియేట్ చేశారు. యూట్యూబ్‌లో ఈటీవీ కంటెంట్ ఎక్కువగా వస్తున్న కారణంగా టెలికాస్ట్ అవుతున్న సమయంలో చూస్తున్న వారి సంఖ్యతక్కువ అయిందనే చెప్పాలి. ఈ పరిస్థితి మారాలంటే మాత్రం ఈటీవీ కొత్త విధానాన్ని అవలంభించాల్సిందే. లేదంటే రేటింగ్ కోల్పోవడంతో ఈటీవీలో ప్రసారమయ్యే షోలు మూసివేసే పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు.
Also Read :
ఒకేరోజు ఒకే స్టోరీ లైన్‌తో విడుదలైన బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల గురించి మీకు తెలుసా..?
ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య విభేదాలకు కారణం ఏంటి..? కలిసి ఎందుకు నటించడం లేదో తెలుసా..!