Home » Tirupati Railway Station: తిరుపతి వెళ్తున్నారా..? ఈ సర్వీస్ ని మిస్ అవ్వద్దు.. రూ.50 మాత్రమే..!

Tirupati Railway Station: తిరుపతి వెళ్తున్నారా..? ఈ సర్వీస్ ని మిస్ అవ్వద్దు.. రూ.50 మాత్రమే..!

by Sravya

చాలామంది ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు కూడా తిరుమల వెళ్తూ ఉంటారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తిరుపతి వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఈ సర్వీస్ ని మిస్ అవ్వకుండా చూసుకోండి. తిరుపతి వెళ్లే వాళ్లందరూ వేరువేరుగా రవాణా మార్గాల్లో వెళ్తుంటారు భక్తులు ఎక్కువగా రైలు మార్గాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. దూర దూర ప్రాంతాల నుండి కూడా శ్రీవారి కోసం వస్తూ ఉంటారు తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తుల కోసం అనేక సదుపాయాలు ని అందిస్తోంది భారతీయ రైల్వేస్.

తిరుపతి రైల్వే స్టేషన్లో ఫైవ్ స్టార్ లాంచ్ అందుబాటులో ఉంది ఇటువంటి ఫైవ్ స్టార్ లాంచ్లు దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లో మాత్రమే ఉన్నాయి అతిథి పేరుతో ఈ లగ్జరీ లాంచ్ అందుబాటులో ఉంది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకి ఫుడ్ కోర్ట్ తో పాటుగా ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ విషయం మనకి తెలుసు. అయితే ఫైవ్ స్టార్ లాంచ్ ఎప్పుడు వచ్చింది ఈ లాంచ్ లో ప్రవేశం ఉచితం కాదు వేరువేరు సమయాలకి వేరు వేరు చార్జీలు ఉంటాయి ప్రయాణికులు ఈ చార్జీలు చెల్లించి లాంజ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అతిథి చార్జీలు చూస్తే మొదటి గంటకి 50 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. రెండు గంటలకి 100 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి.

Also read:

మూడు గంటలకి 150 రూపాయలు ప్లస్ జీఎస్టీ అది నాలుగు గంటలకైతే 200 ప్లస్ జీఎస్టీ, 5 గంటలకి 250 ప్లస్ జీఎస్టీ ఇలా చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటలు కూడా ఇది తెరిచే ఉంటుంది ప్రయాణికులు పైన వివరించిన చార్జీలు చెల్లించి రిలాక్స్ అవ్వచ్చు. రైల్వే స్టేషన్ కి ముందుగానే చేరుకునే ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీద ఎదురు చూడక్కర్లేదు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఏసీ, రెక్లైనర్స్, లగ్జరీ సోఫాలు, వాష్ రూమ్స్, స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఇంటర్నెట్ తో పాటుగా న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ టీవీ కూడా ఉన్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading