Home » Akkineni Nageswara Rao: నాగేశ్వర రావు కి ఆ నటుడు డాన్స్ అంటే చాలా ఇష్టమట..!

Akkineni Nageswara Rao: నాగేశ్వర రావు కి ఆ నటుడు డాన్స్ అంటే చాలా ఇష్టమట..!

by Sravya
Ad

Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ తో పాటు పోటీగా సినిమాల్లో నటించి సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు నాగేశ్వరరావు. సినీ ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకి మామూలు క్రేజ్ లేదు. ఒకప్పుడు చేసిన సినిమాల్లో ప్రేక్షకులందరికీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు నాగేశ్వరరావు. మంచి మంచి సినిమాలు చేయాలని ఎప్పుడూ కూడా నాగేశ్వరరావు కసరత్తు చేస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ తో పాటు పోటీగా సినిమాలు చేసేవారు.

nageswarrao

Advertisement

 

నాగేశ్వరావు నటించిన చాలా సినిమాలు పెద్ద హిట్లయ్యాయి నాగేశ్వరరావు చాలామంది హీరోలతో కలిసి నటించినా చిరంజీవితో నటించడం ఆయనకి చాలా ఇష్టమని ఒకనొక సందర్భంలో చెప్పారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మెకానిక్ అల్లుడు మూవీ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ వీళ్ళ కాంబినేషన్ కి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. నాగేశ్వరావు కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. నాగేశ్వరరావుకి మెగాస్టార్ చిరంజీవి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన చేసే డాన్స్ బాగుంటుందని స్ప్రింగ్ లాగా కదులుతూ ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేస్తారని నాగేశ్వరరావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Also read:

చిరంజీవి మీద ఆయనకున్న అభిమానాన్ని చెప్పారు చిరంజీవి వంటి హీరో ఇండస్ట్రీకి చాలా అవసరం అని కూడా ఆయన అన్నారు. ఈ తరం అయిపోయాక చిరంజీవి వంటి డైనమిక్ హీరో ఇండస్ట్రీకి రావడం అనేది సంతోషంగా ఉందని నాగేశ్వరరావు అన్నారు. అంత పెద్ద హీరో అయి కూడా ఒక హీరోని మెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయం కదా చిరంజీవి సినిమాల్లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చాలామందిని హీరోలుగా మార్చేశారు చిరు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading