Mohan Babu : మోహన్ బాబు కొడుకులైనా మంచు విష్ణు మనోజ్ కూడా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం విష్ణు 150 కోట్ల బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాని తెర మీదకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ కొట్టి పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోవాలని అనుకునే ప్రయత్నం చేస్తున్నారు విష్ణు.
Advertisement
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అయినప్పటికీ ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో పెద్దగా వర్కౌట్ కాలేదు కొన్ని సినిమాలు మంచి హిట్ లను అందుకుంటే, కొన్ని మాత్రం అలానే ఉండిపోయాయి. దాని వలన అప్పటినుండి ఆయనకి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన అవకాశాలు చేసుకుంటూ సినిమాల్లో కనిపించేవారు.
Also read:
Advertisement
- ఆ నటుడితో డివోర్స్ పై క్లారిటీ ఇచ్చిన రుక్మిణీ శీతల్..!
- ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్..నెటిజన్స్ ఏమంటున్నారంటే..?
- ఎండా కాలంలో రోజూ తులసి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ?
ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా కూడా పనిచేశారు చాలా వరకు డబ్బులు వస్తే దానితోనే ఇంటికి కొన్ని డబ్బులు పంపించి కొన్ని డబ్బులు పొదుపు చేసుకునే వారట. ఎలా అయినా సినిమా చేయాలని ఉద్దేశంతో జాబ్ ని కూడా వదిలేసుకున్నారు. వాళ్ళ నాన్నగారుకి చెప్తే ఆయన మోహన్ బాబుని తిట్టడమే కాకుండా నీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎవరిస్తారు, అక్కడికి వెళ్లి ఎవరిని అడుగుతావు జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పారట.
మోహన్ బాబు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఒకరోజు దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడడం వలన సినిమాల్లో నటుడు గా ఎంట్రీ ఇచ్చారు మోహన్ బాబు తర్వాత వరుసగా మంచి సినిమాలు చేసి గుర్తింపుని తెచ్చుకున్నారు. మొదట ఆయన విలన్ గా చేసినప్పటికీ తర్వాత హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు మోహన్ బాబు కొడుకుల అయిన విష్ణు మనోజ్ లు కూడా సినిమాలు చేస్తున్నారు ఇద్దరు కూడా పెద్దగా హిట్లు కొట్టట్లేదు. ఏదో అడపాదడపా సినిమాల చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!