చాలా మంది ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తూ ఉంటారు. కనీసం ఏడాదికి ఒకసారైనా తిరుపతి వెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఏ సమస్యలో ఉన్న తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. తిరుమల పరమ పవిత్రమైనది. ప్రతినిత్యం భక్తులు తండోపతండాలుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. తిరుమల వెళ్లే భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. అయితే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా వుంది.
Advertisement
పురాణాల ప్రకారం తిరుమల వరాహ స్వామికి చెందినది తిరుమలని శ్రీవారికి అప్పగించేందుకు వరాహస్వామి యొక్క షరతుని విధించారు. శ్రీవారితో పాటు తనకి కూడా సమానంగా పూజలు జరగాలని కోరారు. అందుకు వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నారు అలా తిరుమల కి వచ్చే భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహ స్వామి వారిని దర్శించుకోవాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి.
Also read:
- ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
- వాసన భరించలేకపోయినప్పటికీ.. చెమట మంచిది..!
- హీరోయిన్ నయనతార 40 సెకన్ల యాడ్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement
తిరుమల కి వెళ్లేవాళ్లు తిరుమల వెంకటేశ్వర స్వామి తో పాటుగా అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలను కూడా చూస్తూ ఉంటారు. ప్రకృతి అందాల మధ్య ఏడుకొండల పై కొలువుతీరిన తిరుపతి క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీవారి దర్శనం తో పాటుగా భక్తులు సందర్శించాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఆలయాలు చారిత్రక నిర్మాణాలు జలపాతాలు, ఉద్యానవనాలు, వణ్యప్రాణులు ఇలా చాలా ప్రదేశాలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. తాజాగా తిరుమల కి సంబంధించి కొన్ని పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!