ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటు ఈ ఏడాది మన దేశంలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలోనే ఈ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. టోర్నీ ప్రారంభానికి పది రోజుల ముందు జట్టును ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోపు గాయాల నుంచి కోరుకున్న ప్లేయర్లను… అలాగే ప్రస్తుతం బాగా ఆడుతున్న ఆటగాళ్లను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి మన తెలుగు ఆటగాడు వచ్చాడు.
Advertisement
హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టి20 టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో అదరగొట్టాడు. మొదటి మ్యాచ్ లోనే 39 పరుగులు చేసిన తిలక్ వర్మ… రెండో మ్యాచ్ లో 51 పరుగులు మొన్న జరిగిన మూడవ మ్యాచ్ లో 49 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో తిలక్ వర్మాను టీమిండియా వన్డే వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా సూచిస్తున్నారు. అటు ఎమ్మెస్ కే ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ చాలా అద్భుతంగా ఆడాడు.. యువరాజ్ రిటైర్మెంట్ అయిన తర్వాత అలా ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇప్పటివరకు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.
Advertisement
ఇలాంటి తరుణంలోనే లెఫ్ట్ అండ్ బ్యాట్స్మెన్ అయిన తిలక్ వర్మ తెరపైకి వచ్చాడు. ఇదే ఆట తీరును వరల్డ్ కప్ వరకు తిలక్ వర్మ కంటిన్యూ చేస్తే… యువరాజు స్థానం లో ఈ తెలుగు క్రికెటర్ ను పంపించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. తిలక్ వర్మ చాలా అటాకింగ్ బ్యాట్స్మెన్. అలాగే కన్సిస్టెంట్గా ఆడగల సత్తా ఉంది. అటు ఫీల్డింగ్ కూడా ఖతర్నాక్ చేస్తాడు. ఇక టీమిండియాలో సురేష్ రైనా మరియు యువరాజ్ సింగ్ తర్వాత అలాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి వరల్డ్ కప్ గెలవాలంటే తిలక్ వర్మ లాంటి లెఫ్ట్ హ్యాండ్ వినియోగించుకోవాలని సీనియర్లు కూడా సూచనలు చేస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి :
మోడీ ప్రభుత్వంతో…. ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తాను – పవన్ వార్నింగ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్…!