ఐపీఎల్ 2022 లో తెలుగు క్రికెటర్స్ ఆడించి చాలా తక్కువ మంది. అందులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఒక్కడు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం జరిగిన మెగవేలంలో 1.70 కోట్లకు తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేయడంతో వెలుగులో వచ్చిన తిలక్ ఆ తర్వాత తన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ లో సీజన్ మొత్తం బాగా రాణించిన ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తిలక్ ఒక్కడే.
Advertisement
ఈ ఐపీఎల్ సీజన్ లో 2 హాఫ్ సెంచరీలతో 14 మ్యాచ్ లలో ఏకంగా 397 పరుగులు చేసిన తిలక్ ఆ జట్టు తరపున ఈ సీజన్ లో అతయధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ ఐపీఎల్ ముగియడంతో ఇంటికి చేరుకున్న తిలక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఈ ఐపీఎల్ సీజన్ లో వచ్చిన డబ్బును ఏం చేశాను అనే విషయాన్ని బయటపెట్టేసాడు. నేను ఈ యల్ కంటే ముందు చాలా కష్టాలు పడ్డాను. రోజు ప్రాక్టీస్ కు బస్సులో వెళ్ళేవాడిని. నా క్రికెట్ కిట్ చూసి కొంతమంది నన్ను బస్సు ఎకానిచ్చేవారు కాదు.
Advertisement
కానీ ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు. నాకు వచ్చిన డబ్బుతో ఓ కారు కొనుకోగలను. అయితే ఈ డబ్బు అనేది ఎవరినైనా మార్చేస్తుంది. దానికి నేనేమి మినహాయింపు కాదు. అందుకే నాకు ఈ ఐపీఎల్ లో వచ్చిన డబ్బు మొత్తని మా నాన్నకు ఇచ్చేసాను. నాకు కనిపించకుండా దానిని ఎక్కడైనా పెట్టమని చెప్పను. ఎబెదుకంటే డబ్బు వాళ్ళ లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలూ కూడా అనే ఉన్నాయి అని తిలక్ చెప్పాడు, ఇక ఈ యాపిల్ లో చేసిన ప్రదర్శనతో వచ్చే ఐపీఎల్ లో కూడా ముంబై తరపునే తిలక్ ఆడటం అనేది ఖాయం. కాబట్టి చూడాలి మరి ఆ సీజన్ లో తిలక్ ఎలా రానిస్తాడు అనేది.
ఇవి కూడా చదవండి :