Home » భారత జట్టుకు అతి పిన్న వయస్సులో కెప్టెన్సీ చేసిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..?

భారత జట్టుకు అతి పిన్న వయస్సులో కెప్టెన్సీ చేసిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..?

by Azhar
Ad

భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం మన దేశంలోనే టీ20 సిరీస్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో జట్టును నడిపే బాధ్యత కేఎల్ రాహుల్ చేతికి వచ్చింది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీం ఇండియా ఏం చేస్తుందో అనుకున్నారు. కానీ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు అంటే నిన్న రాహుల్ కు గాయం కావడంతో నాయకత్వ బాధ్యత రిషబ్ పంత్ చేతికి వచ్చింది.

Advertisement

అయితే పంత్ కు ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది.. కానీ టీం ఇండియాకు కెప్టెన్ గా ఇదే మొదటి మ్యాచ్. ఈ సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ గా వ్యవరిస్తున పంత్.. అతి చిన్న వయస్సులో టీం ఇండియాకు టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పంథా వయస్సు ఇప్పుడు 24 సంవత్సరాల 248 రోజులు. కానీ ఈ అతి చిన్న వయస్సులో భారత జట్టుకు కెప్టెన్ గా చేసిన లిస్ట్ లో మొదటి స్థానంలో మాజీ స్టార్ ఆల్ రౌండర్ సురేష్ రైనా ఉన్నారు. రైనా మొదటిసారి టీ20 జట్టుకు కెప్టెన్సీ చేసిన సమయంలో అతని వయస్సు 23సంవత్సరాల 197రోజులు గా ఉంది.

Advertisement

ఇక ఈ లిస్ట్ లో మన వరుస క్రమంలో చూసుకుంటే.. మొదటి రెండు స్థానాలు రైనా, పంత్ ఉండగా మూడో స్థానంలో ధోనీ ఉన్నాడు. ఇక ఆ తర్వాత నాలుగులో వీరేంద్ర సెహ్వాగ్ ఉండగా.. విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఆరు లో అజింక్యా రహానే ఉంటే చివరి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే ఈరోజు మ్యాచ్ లో పంత్ జట్టును ఎలా నడుపుతాడు అనేది ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రాహుల్ కెప్టెన్సీలో కొంత విఫలం అవుతుండటంతో పంత్ బాగా నడిపితే అతనే రోహిత్ తర్వాత భవిష్యత్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

భారత ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ 5..!

మిథాలీ రాజ్ టాప్ రికార్డ్స్ ఇవే…!

Visitors Are Also Reading