Telugu News » Blog » ఉమ్రాన్ ను టీమిండియాకు తీసుకోవడం పై కపిల్ దేవ్ సీరియస్..!

ఉమ్రాన్ ను టీమిండియాకు తీసుకోవడం పై కపిల్ దేవ్ సీరియస్..!

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ లో సంచలనంగా మారిన ఉమ్రాన్ మాలిక్ ను బీసీసీఐ సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అనుకోకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ ను ఈ ఏడాది ఆ జట్టు రిటైన్ చేసుకొని అన్ని మ్యాచ్ లలో ఆడించింది. ఇక ఆడిన ప్రతి మ్యాచ్ లో 150 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరినా మాలిక్ ను జట్టులోకి తీసుకోవాలని చాలా డిమాండ్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే ఈ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఉమ్రాన్ కు చోరు కల్పించారు బీసీసీఐ సెలక్టర్లు.

Advertisement

కానీ ఉమ్రాన్ ను భారత జట్టుకు ఎంపిక చేయడం పై భారతమా మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్ అయ్యారు. ఉమ్రాన్ ను టీం ఇండియాకు తీసుకునేందుకు నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఇంత త్వరగా అతడిని టీం ఇండియాకు అఆడించకపోతే బాగుండేది. ఉమ్రాన్ ఓ అరుదైన బౌలర్. అందువల్ల అతడిని చాలా జాగ్రత్తగా ఉపయోంచుకోవాలని. కనీసం అతనికి ఇంకా మూడు ఏళ్ళు అయిన సమయం ఇవ్వాల్సింది. ఈ మూడేళ్ళ కాలంలో ఉమ్రాన్ ను మాజీ దిగ్గజ బౌలర్ల దగ్గరకు పంపి మెళుకువలు నేర్పించాలి.

Advertisement

అలాగే అతనికి సమయం ఉనప్పుడల్ల మాజీ బౌలర్ల వీడియోలు చుపించాల్సింది. ఇక తన లైన్ అండ్ లెన్త్ కోసం ద్రేశావళి టోర్నీలలో ఆడించాల్సింది. ఎందుకంటే గంటకు 150 కీ.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు వేసే బౌలర్ ఎకానమీ 9 ఉండకూడదు. అది 6-7 మించకూడదు. అందుకే ఉమ్రాన్ దీని పైన బాగా ఫోకస్ చేయాలి. అయితే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసేవారు వికెట్లు తీయలేరు. కానీ ఉమ్రాన్ ఆ పని కూడా చేస్తున్నాడు. అందుకే అతను తన యార్కర్ల పైన ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉమ్రాన్ విఫలమైతే మళ్ళీ అతను జాతీయ జట్టులోకి రావడం అనేది చాలా కష్టం అని కపిల్ దేవ్ తెలిపారు.

Advertisement

ఇవి కూడా చదవండి :

సూర్యుని దెబ్బకు ఐసీసీ రూల్స్ మార్చేసిన బీసీసీఐ…!

మిథాలీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలుసా..?