ఆసియా క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్ మ్యాచ్ కు చేరుకుంది. చైనాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది యంగ్ టీమ్ ఇండియా. బంగ్లాదేశ్ ఇచ్చిన 97 పరుగుల టార్గెట్ ను 9.2 ఓవర్లలోనే చేజ్ చేశారు భారత్ బ్యాటర్లు. జైస్వాల్ డకౌట్ అయినా, కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ తో కలిసి తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టాడు.
6 సిక్స్ లు, 2 ఫోర్లతో 26 బంతుల్లోనే 55 పరుగులు చేసి తను ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ లో తిలక్ వర్మ తన తల్లిదండ్రులపై గల ఎంత ప్రేమ ఉందో తన టాటూ రూపంలో తెలియజేశాడు. భారీ సిక్సర్ తో హాఫ్ సెంచరీ కొట్టిన తిలక్ వెంటనే తన జెర్సీని పైకెత్తి తన నడుము ముందు భాగంలో వేయించుకున్న తన అమ్మానాన్నల టాటూను చూపించాడు.
Advertisement
Advertisement
మ్యాచ్ తర్వాత ఈ విక్టరీని అమ్మానాన్నల గుర్తుకు అంకితం చేస్తున్నానన్న తిలక్…. తన ఫ్రెండ్ రోహిత్ శర్మ డాటర్ సమీరాకు ఇందులో క్రెడిట్ ఇస్తున్నానని అన్నాడు. అమ్మనాన్నలపై ప్రేమతో తిలక్ వేయించుకున్న టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్లను గెలిపించడమే కాదు తనను ఈ స్టేజ్ కి తీసుకు వచ్చిన పేరెంట్స్ మీద తిలక్ ప్రేమను ఎలా చాటుకున్నాడో చూడండి అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- అప్పుడు తండ్రి… ఇప్పుడు కొడుకు…పాక్ ను భయపెట్టిన నెదర్లాండ్స్ !
- మహేశ్ “గుంటూరు కారం”లో అనసూయ..?
- నీ అంతు చూస్తా బండారు పై రెచ్చిపోయిన ఖుష్బూ !