Home » హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !

హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !

by Bunty
Ad

 

హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE ఫైట్ జరగనుంది. వచ్చేనెల 8న గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ స్టార్ స్టెప్లక్లస్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. దీనికి సంబంధించి నెలరోజుల ముందే టికెట్లు విడుదల చేయగా… హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. WWE ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో క్రేజ్ ఉంది. విపరీతమైన క్రేజ్ ఉన్న WWE ప్రోగ్రాం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆసక్తిగా చూసే కార్యక్రమాల్లో WWE కూడా ఒకటి.

Advertisement

నిజానికి ఈ కార్యక్రమాలు ఎక్కువగా అమెరికాలో నిర్వహిస్తూ ఉంటారు. తరచూ బయట దేశాల్లో కూడా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనదేశంలో కూడా ఇప్పటికే చాలాసార్లు కండక్ట్ చేశారు. సరిగ్గా హైదరాబాదులో WWE ఈవెంట్ జరిగిన నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 28 మంది అంతర్జాతీయ ఫైటర్లు ఇందులో పాల్గొంటారు. సూపర్ ఫైట్ లో పాల్గొనేందుకు ప్రపంచ హెవీ వెయిట్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్ హైదరాబాద్ కు రానున్నాడు. విమెన్ ఛాంపియన్ రియా రిప్లే కూడా ఈ ఫైట్ కు రానున్నారు.

Advertisement

WWE ట్యాగ్ టీం ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఒవెన్స్ తోపాటు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంతర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రు మెక్ ఇంటైర్, బెక్కిలించ్ నటల్య, మాట రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి స్టార్స్ WWE ఈవెంట్ లో సందడి చేయనున్నారు. ఈవెంట్ కి సంబంధించిన టికెట్లు అమ్మకం నెలరోజుల క్రితం నుంచే మొదలుపెట్టారు. 500 రూపాయల నుంచి 17వేల రూపాయల వరకు టికెట్లు ధరలు ఉన్నాయి. WWE ఈవెంట్ హైదరాబాదులో జరుగుతుందని తెలిసి టికెట్ల కోసం జనాలు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి 

Rajinikanth : ‘జైలర్’ పై పగ తీర్చుకున్న RCB !

సమంత ప్రైవేట్ పార్ట్స్ పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు !!

హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!

Visitors Are Also Reading