Home » ఆదిపురుష్ లో ఎన్ని పాటలు ఉన్నాయి.. ఎప్పుడు వస్తాయో తెలుసా..?

ఆదిపురుష్ లో ఎన్ని పాటలు ఉన్నాయి.. ఎప్పుడు వస్తాయో తెలుసా..?

by Azhar
Ad
ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒక్కటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అనేది తెలిసిందే. అలాగే సీత పాత్రలో కృతి సనాన్ నటిస్తుంది. ఇక ఈ మధ్యే ఈ సినిమా టీజర్ అనేది విడుదల చేసారు. కానీ అది జనాలకు అంతగా నచ్చలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ అనేది బయటికి వచ్చింది.
ఆదిపురుష్ సినిమాలో ఉన్న పాటల గురించి ఓ చర్చ అనేది నడుస్తుంది. అయితే ఆది ఆదిపురుష్ సినిమాలో మొత్తం 3 పాటలు అనేవి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా సంగీతం అందిస్తున్న అజయ్ అతుల్.. ఆ పాటలను అదరగొట్టాడు అని తెలుస్తుంది. ఇక ఈ మూడు పాటలు ఎక్కడ వస్తాయో కూడా ట్రెండ్ అవుతుంది.
ఆదిపురుష్ సినిమాలోని జై శ్రీరామ్ అనే ఓ పాట ఇప్పటికే టీజర్ లోనే ఉంది. ఈ పాట అనేది సినిమా మొత్తం కీలక సన్నివేశాల్లో వస్తుంది అని తెలుస్తుంది. అలాగే మరో అద్భుతమైన పాట అనేది రాముడు, సీత కలుసుకున్న సమయంలో వస్తుంది అని సమాచారం. టీజర్ లో కనిపించిన ఆ ఉయ్యాలా సన్నివేశం ఆ పాటలోనిదే అని తెలుస్తుంది. ఇక మూడో పాట కేవలం ప్రమోషన్స్ కోసమే అన్ని.. అది సినిమా పూర్తి అయిన తర్వాత చివర్లో వస్తుంది అని అంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading