Home » యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

by Bunty

 

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఆల్రౌండర్ గా కొనసాగుతూ అనేక విజయాలను అందించాడు యువరాజ్ సింగ్. లెఫ్ అండ్ బ్యాటర్ గా కొనసాగుతూ ఒకప్పుడు భయంకరమైన ప్లేయర్గా కొనసాగాడు. 1981 సంవత్సరంలో జన్మించిన యువరాజ్ సింగ్… 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు యువరాజు.

ఇక యువరాజ్ సింగ్ 2019 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కు బై చెప్పాడు. ఇది ఇలా ఉండగా తాజాగా క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లిపై ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు కేసులో ఇరికిస్తామని… మీ కుటుంబ పరువు పోకుండా ఉండాలంటే 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సదరు మహిళ. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఆ మహిళ బెదిరింపులకు దిగడంతో…. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు యువరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు. నిందితురాలు ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీంతో యువరాజు సింగ్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కాగా యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్ నిందితురాలని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె ఇలా చేసినట్లు సమాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

Visitors Are Also Reading