Home » జీన్స్‌ ప్యాంట్‌ వేసుకునే వారు ఈ తప్పు అస్సలు చేయకండి..!

జీన్స్‌ ప్యాంట్‌ వేసుకునే వారు ఈ తప్పు అస్సలు చేయకండి..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది ప్రస్తుతం జీన్స్ ధరిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టపడతారు. అయితే వీటి గురించి ఎవరు అంత ఎక్కువగా పట్టించుకోరు. సమయం దొరికినప్పుడల్లా ఉతుకుతుంటారు. అయితే ఇదే మీరు చేస్తున్న పెద్ద తప్ప అనే చెప్పాలి. చాలామంది నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఇష్టమైన జీన్స్ ని పదేపదే ఉతకడం మంచి పద్ధతి కాదంటున్నారు. ఇలా చేస్తే మీరు పెద్ద తప్పు చేస్తున్నారనే చెప్పవచ్చు.

Advertisement

ప్రపంచంలోనే మొట్టమొదటి జీన్స్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ జీన్స్ కంపెనీ లెవిన్ CEO ఛీప్ బెర్గ్ జీన్స్ ని ఎప్పుడు ఉతకకూడదని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం లేవిస్ వెబ్ సైట్ లో జీన్స్ ని ఎప్పుడూ ఉతకకూడదని రాసుకొచ్చారు. వాషింగ్ మిషిన్ లో జీన్స్ ఉతకావాల్సిన అవసరం లేదు. అవసరమైతేనే ఉతకాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే జీన్స్ ఉతకకూడదు.. మరి ఎలా శుభ్రం చేయాలంటే దానికి ఒక మార్గం చెప్పాడు. జీన్స్ పై పడినా ఏదేని మరకలను టూత్ బ్రష్ తో శుభ్రం చేయాలన్నాడు. జీన్స్ ని ఉతకడం వల్ల దాని పదార్థం దెబ్బతింటుందని, నీరు కూడా వృధా అవుతుందని చిప్ బెర్గ్ సూచించాడు. కొత్త జీన్స్ ను కనీసం ఆరు నెలల తర్వాత మాత్రమే ఉతకాలన్నాడు.

Advertisement

Also Read :  ప్రతిరోజు పరిగడుపున జీలకర్ర వాటర్ తాగితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

జీన్స్ నుంచి బ్యాక్టీరియాను నివారించడానికి మాత్రం రాత్రిపూట ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నాడు. ఉదయం అందులో నుంచి తీసి ఎండలో ఆరేయాలని సూచించాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజుల వరకు దానిని ఉతకవలసిన పని లేదని చెప్పుకొచ్చాడు. . జీన్స్ శుభ్రంగా లేదని మీకు అనిపిస్తే చల్లటి నీటితో ఉతకాలి అన్నాడు. జీన్స్ ను ఇతర బట్టల నుంచి విడిగా ఉతకాలి అన్నాడు. అంతేకాదు వాషింగ్ మెషిన్ లో కాకుండా చేతితో శుభ్రం చేయాలన్నాడు. అంతేకాకుండా వాషింగ్ గురించిన సమాచారం జీన్స్ ట్యాగ్ మీద ఉంటుందని అందరూ ఇది గమనించాలని సూచించాడు.

Also Read :  టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో తెలుసా ?

Visitors Are Also Reading