Home » రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం, బాడీని ఫిట్ గా ఉంచేందుకు రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీ తింటున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్న ఫలంగా మార్చడం సరికాదు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ చపాతీలను తినే అలవాటును చేసుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే లేనిపోని కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందట. 

Also Read :  Ugadi 2023 : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధనలాభం

Advertisement

అందువల్ల రాత్రిపూట పూర్తిగా అన్నం మానేసి దాని స్థానంలో చపాతీ తినే బదులు.. అన్నం తక్కువ తిని మిగతా భాగం చపాతీలు తినమని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినే చపాతీల కన్నా మధ్యాహ్నం చేసుకొని రాత్రికి తినడం చాలా ఉత్తమం అంటున్నారు. చపాతీలలో నూనె తక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అందులో పోషకాలు నిర్వీర్యమైపోతాయి. కానీ చపాతీలు, రోటీలు ఎక్కువ సేపు నిలువ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది అట. ఈ నేపథ్యంలోనే చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  సపోటా పండుతో కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..!

Advertisement

Manam News

చపాతీ వల్ల కలిగే ప్రయోజనాలు : 

  • నిద్ర పోయేటప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చు అవుతుంది. మనలో ఉన్నటువంటి క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల ఖర్చుకాకపోవడంతో కొవ్వుగా మిగిలిపోయి మనిషి లావుగా అయ్యే ప్రమాదముంది. రాత్రి వేళ చపాతీలు తినడం ఉత్తమం. 
  • రాత్రి భోజనం చేసి, వెంటనే నిద్రించడం ఆరోగ్యానికి చాలా హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతి తింటే బాగుంటుందని సూచిస్తున్నారు నిపుణులు. 
  • ప్లేట్ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని.. డాక్టర్లు పేర్కొంటున్నారు. అన్నం కన్నా చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. 
  • చపాతీకి ఉపయోగించే గోధుమలలో ఎలాంటి కొవ్వు పదార్థాలుండవు. విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
  • గోదుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. చపాతీని తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే చాలా బెటర్.  

Also Read :  నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!

Visitors Are Also Reading