Home » అధిక బ‌రువు ఉన్న వారు చికెన్ అస్స‌లు తిన‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

అధిక బ‌రువు ఉన్న వారు చికెన్ అస్స‌లు తిన‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

by Anji
Ad

నాన్ వెజ్ ప్రియుల‌కు చికెన్ అంటే ఎంత ఇష్ట‌మో ఇక మాట్లో అయితే చెప్ప‌లేం. ఏదైనా పార్టీ జ‌రిగితే అందులో త‌ప్ప‌కుండా చికెన్ ఉండాల్సిందే. చికెన్ ఐట‌మ్స్ ఎంతో ఇష్టంగా లాగిస్తుంటారు. ఇది శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు అందించ‌డంతో పాటు కండ‌రాలు దృఢంగా మార్చేందుకు స‌హాయ‌ప‌డుతుంది. చికెన్ బ్రెస్ట్‌లో లూసిన్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది కండ‌రాల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. ఎంత ఇష్ట‌మైనా ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నా ఎక్కువ‌గా తింటే ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం ప‌డుతుంద‌నే విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.


చికెన్ రోజూ తింటే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు కూడా చికెన్ కొనేట‌ప్పుడు వండే స‌మ‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని మ‌నం చేసే అతి చిన్న పొర‌పాట్ల కార‌ణంగా భారీ మూల్యం చెల్లించే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ క్లినిక‌ల్ న్యూట్రిష‌న్ ప్ర‌కారం.. చికెన్ ఎక్కువ‌గా తింటే ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని ద్వారా ర‌క్తం చిక్క‌బ‌డుతుంది., ర‌క్త నాళాల్లో ప్ర‌వాహం స‌రిగ్గా జ‌ర‌గ‌క గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా అంద‌దు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవి ఇచ్చిన ఐడియాతో స్టోరీ రెడీ చేసుకున్న రైటర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలుసా ? ఏ సినిమా అంటే ?

ఇది కూడా చ‌ద‌వండి :  మంచం మీద పొర‌పాటున కూడా ఈ వ‌స్తువులు ఉంచ‌కండి.. ఉంచితే క‌ష్టాలు త‌ప్ప‌వు..!

చికెన్ లో ఉండే ప్రోటీన్ వ‌ల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు చికెన్ కి దూరంగా ఉండ‌డం మంచిది. శాక‌హారులక‌న్న నాన్ వెజ్ తినే వారి శ‌రీర బ‌రువు అధికంగా ఉంటుంద‌ని ఓ అధ్య‌యంలో వెల్ల‌డి అయింది. చికెన్ అధికంగా తీసుకోవ‌డం ద్వారా మూత్రనాళ ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని వైద్యులు చెబుతున్నారు. తాజా చికెన్ కొన‌డం, చికెన్ త‌క్కువ‌గా తిన‌డం వంటివి పాటించాలి. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వ్య‌ర్థాలు స‌రిగ్గా ఫిల్ట‌ర్ అవ్వ‌క‌, మూత్ర నాళ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. త‌క్కువ మోతాదులోనే చికెన్ తినాల‌ని సూచిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి  : మీ ఆహారంలో టోఫును చేర్చుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే దాన్ని వ‌ద‌ల‌రు..! 

 

Visitors Are Also Reading