Home » అలియా, ఒలీవియా కి ముందు రాజమౌళి అనుకున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

అలియా, ఒలీవియా కి ముందు రాజమౌళి అనుకున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

వారు చేయ‌డానికి చిన్న క్యారెక్ట‌ర్ మాత్ర‌మే కావ‌చ్చు. కానీ వారికి పాపులారిటీ క్రేజ్ మాత్రం చాలా పెద్ద‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.న ఎందుకంటే ఆ క్యారెక్ట‌ర్‌ను చెక్కింది జ‌క్క‌న్న కాబ‌ట్టి.. టాలీవుడ్ టాప్ స్టార్స్ చ‌ర‌ణ్‌, తార‌క్ అందులో అది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ క్యారెక్ట‌ర్‌ను అంత మంచి అవ‌కాశాన్ని ఎవ‌రైనా వ‌దులుకుంటారా చెప్పండి. మ‌న‌కు తెలిసి ఎవ్వ‌రు వ‌దులుకోరు.. కానీ ఇక్క‌డ కొంత మంది హీరోయిన్లు వ‌దులుకున్నారు. వారు ఎవ్వ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. వారం రోజుల్లోనే 750 కోట్ల‌కు పైగా బాలీవుడ్, టాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌తో పాటు ఓవ‌ర్సీస్ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకుంటోంది. రామ‌రాజు, భీమ్ పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టించ‌గా తార‌క్‌కు జోడీగా ఈ సినిమాలో ఒవిలీయా మోరిస్ న‌టించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర కొర‌కు మేక‌ర్స్ తొలుత సాహో సినిమాలో న‌టించి మెప్పించిన శ్ర‌ద్ధాక‌పూర్‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే వేర్వేరు కార‌ణాల వ‌ల్ల శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్ప‌లేదు.

Advertisement

Also Read :  Niharika: నిహారికకు పవన్ క్లాస్ ! ఆ పోస్ట్ అర్థం అదేనా?


అప్ప‌టికే వేరే సినిమాల‌కు డేట్ కేటాయించ‌డం వ‌ల్ల శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాను వ‌దులుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌రిణీతి చోప్రాను సంప్ర‌దించార‌ట‌. అయితే సీత పాత్ర‌కు డేట్స్ కేటాయించే విష‌యంలో ఇబ్బందులు ఎదురుకావ‌డంతో ప‌రిణితి చోప్రా కూడా ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్నార‌ని బోగ‌ట్టా. ఎన్టీఆర్ తొలుత అమిజాక్స‌న్ ను సంప్ర‌దించారు.

అయితే అమిజాక్స‌న్ గ‌ర్భ‌వ‌తి కావ‌డం వ‌ల్ల ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్నారు. ఆ త‌రువాత పాత్ర‌ కొర‌కు హాలీవుడ్ న‌టి డైసీ ఎడ్గార్ జోన్స్‌ను తీసుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌రువాత ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా న‌టించ‌డానికి ఎంపిక కావ‌డం జ‌రిగింది. చ‌ర‌ణ్ అలియా జోడీ, ఎన్టీఆర్ ఒలివియా మోరీస్ జోడీ బాగుంద‌ని నెటిజ‌న్ల నుంచి కామెంట్లు వ్య‌క్తం అవుతున్నాయి. బాక్సాపీస్ వ‌ద్ద ఆర్ఆర్ఆర్ అంచ‌నాల‌ను మించి విజ‌యం వైపు దూసుకెళ్లుతోంది.

Also Read :  RAMCHARAN : చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాలో పాట, ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్..ఎన్నికోట్లంటే..!

Visitors Are Also Reading