Home » RAMCHARAN : చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాలో పాట, ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్..ఎన్నికోట్లంటే..!

RAMCHARAN : చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాలో పాట, ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్..ఎన్నికోట్లంటే..!

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. సినిమాలో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దాంతో చ‌ర‌ణ్ కు దేశ‌వ్యాప్తంగా అభిమానులు అయ్యారు. మ‌రోవైపు చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమాలో కూడా రామ్ చ‌ర‌ణ్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు.

ramcharan

ramcharan

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇక ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుండి ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేయ‌గా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా కోసం శంక‌ర్ భారీగా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. సినిమాలోని ఒక్క పాట కోస‌మై ఏకంగా ప‌దికోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట. అదే విధంగా సినిమాలోని ఒక ఫైట్ కోసం కూడా 10 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

రామ్ చ‌రణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసుకున్నాడు కాబట్టి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చ‌రణ్ కు జోడీగా కియారా అద్వాని న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విల‌న్ గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నారు. మ‌రి ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading