Home » నందమూరి హీరోల పేరిట ఉన్న ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదా..?

నందమూరి హీరోల పేరిట ఉన్న ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది.. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగానే ఈ ఫ్యామిలీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే మూడోతరం హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు.. అలాంటి నందమూరి ఫ్యామిలీ పేరిట ఒక సరికొత్త రికార్డు ఉంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో డబుల్ రోల్ చేసిన హీరోలను చాలామందినే చూశాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఈ తరం హీరోల్లో ఏ హీరో కూడా చేయని విధంగా మూడేసి పాత్రలో నటించారు.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్..బాబీ డైరెక్షన్లో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో అదరగొట్టారు. లవ, కుశ, జై పాత్రల్లో నటించి మెస్మరైజ్ చేశారు. కానీ ఈ సినిమా కేవలం నట విశ్వరూపం వల్లే హిట్ అయిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రెండు మూడు నాలుగు పాత్రలకు కూడా నటించి మెప్పించారు. దానవీరశూరకర్ణ చిత్రంలో కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా, ఎన్టీఆర్ నటన అద్భుతం. ఇక చాలామంది హీరోలు ఎన్నో పాత్రల్లో నటించారు. ఇక కమలహాసన్ అయితే దశావతారంలో ఏకంగా 10 పాత్రలో నటించి మెప్పించారు. 1966 లో వచ్చిన నవరాత్రి సినిమాలో ఎన్టీఆర్ తొమ్మిది పాత్రలు వేశారు.

Advertisement

ఆ తర్వాత కృష్ణ,శోభన్ బాబు, చిరంజీవి కూడా మూడు పాత్రలో నటించారు. అయితే ఈ తరం హీరోల్లో మాత్రం ఎవరూ త్రిపుల్ రోల్స్ చేయలేదు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమా, కళ్యాణ్ రామ్ రాబోతున్న అమీగోస్ సినిమాలో త్రిబుల్ రోల్ లో చేశారట. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ నుంచే ముగ్గురు హీరోలు మూడేసి పాత్రలకు పైగా నటించడం అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఈ రికార్డును బ్రేక్ చేసిన వారు లేరు.

also read:

Visitors Are Also Reading