Home » అప్స‌ర‌, నైనాల‌తో క‌లిసి పునీత్ కు నివాళి అర్పించిన ఆర్జీవీ… వీడియో వైరల్…!

అప్స‌ర‌, నైనాల‌తో క‌లిసి పునీత్ కు నివాళి అర్పించిన ఆర్జీవీ… వీడియో వైరల్…!

by AJAY
Ad

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గ‌తేడాది గుండె పోటుతో మ‌రణించిన సంగ‌తి తెలిసిందే. ఎంతో యాక్టివ్ గా ఫిట్ గా క‌నిపించే పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండ‌గానే కుప్ప‌కూలి మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ఇంకా చిత్ర‌ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోనేలేదు. ఇక రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ న‌టించిన జేమ్స్ సిసిమా విడుద‌లైంది.

Advertisement

ఈ సినిమాను క‌న్న‌డ తో పాటూ ఇత‌ర భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు. అయితే పునీత్ ను ఇప్ప‌టికీ సినీప్ర‌ముఖులు…అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించారు. వ‌ర్మ బెంగుళూరు లోని పునీత్ రాజ్ కుమార్ మెమోరియ‌ల్ వ‌ద్ద‌కు వెళ్లారు.

Advertisement

Ramgopal varma

Ramgopal varma

 

అదే విధంగా పునీత్ తండ్రి రాజ్ కుమార్ ఆయ‌న భార్య పార్వ‌త‌మ్మ‌ల‌కు కూడా నివాళులు ఆర్పించారు. ఇక ఆర్జీవీ వెంట నైనా గంగూలి అప్స‌ర రాని కూడా ఉన్నారు. వీరిద్ద‌రితో క‌లిసి ఆర్జీవి వరుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఆర్జీవి ప్ర‌స్తుతం ఆర్జీవి క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌తో ఆర్ అనే సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading