Home » తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తే ఇదే జరుగుతుందట.. ప్రముఖ జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్..!!

తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తే ఇదే జరుగుతుందట.. ప్రముఖ జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్..!!

by Sravanthi

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో తారకరత్న ఆరోగ్యం గురించి వార్తలు వస్తున్నాయి. యువగలం పాదయాత్రలో తారక రత్న గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉండటంతో తారకరత్నకు ఏమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. ఆయన బ్రెయిన్ కు రక్తం సరఫరా ఆగిపోవడంతో, బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందనే కథనాల నడుమ ఆయనకు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళుతున్నట్టు సమాచారం అందుతుంది. ఈతరణంలోనే తారకరత్న జాతకంపై, కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు ప్రముఖ దత్త ఉపసకులు మురళీ శర్మ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తారకరత్నది మృగశిర నక్షత్రం కావడం వల్ల ఆయనది మిధున రాశి అని తెలియజేశారు. ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే శని ఇక పంచమ స్థానంలోకి వెళ్ళబోతుందని, దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. గతంలో ఆయన కుటుంబానికి దూరమవడం, కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారంటూ తెలిపారు. ఆయన జాతకం ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందని అన్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా తారకరత్నకు శని దశ వెళ్ళిపోవడం వల్ల మళ్లీ కుటుంబానికి దగ్గరవడం జరిగిందని చెప్పారు.

అయితే మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని అన్నారు. మిధున రాశికీ అధిపతి బుధుడు.. ఈయనను మెడిసిన్ కి అధిపతిగా చెబుతారు. ఈ బుధుడు ప్రస్తుతం శని ఇంట ఉండటం వల్ల జనవరిలో తారకరత్నకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం శని మార్పు జరగడం వల్ల ఆయనకు మంచి జరుగుతుందని, విదేశాలకు వెళితే సెట్ అవుతారని తెలియజేశారు మురళీ శర్మ..

also read:

Visitors Are Also Reading