వాణి జయరామ్ ఆమె గొంతులో ఎంతటి మాధుర్యం ఉందో ఆమె పాటలు వింటే ఎంతటి టెన్షన్ అయినా ఇట్టే పారిపోతుంది. అలాంటి మదర సంగీత గాయని వాణి జయరామ్. గత ఐదు దశాబ్దాల నుంచి సంగీత ప్రియుల్ని అలరిస్తూ వస్తోంది. 78 సంవత్సరాల వాణి జయరామ్ ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చెన్నైలోనే తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణి జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం.
Advertisement
ఇదిలా ఉండగా, వాణి జయరామ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జాతకం గురించి ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను తెలియజేశారు. ఈమె పుట్టిన పది రోజులకే తన జాతకం ఎలా ఉండబోతుందో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని, అయితే ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు జరిగిందని తెలుస్తోంది. ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రులకు ఐదవ సంతానమని తెలిపారు. ఈమె పుట్టిన పది రోజులకే తన తల్లికి తీవ్రమైన జ్వరం వచ్చిందని, అలాగే తనకు అప్పటికి ఇంకా నామకరణం కూడా చేయలేదని వాణి జయరామ్ తెలిపారు.
Advertisement
ఇలా తాను పుట్టిన పది రోజులకు తన తండ్రి తన పుట్టిన తేదీ తీసుకొని జ్యోతిష్యుడు వద్దకు వెళ్తే ఆయన తన జాతకాన్ని పరీక్షించి తనకు కలైవాణి అనే పేరు పెట్టమని చెప్పారట. అలాగే ఈ చిన్నారి పెరిగి పెద్దయిన తర్వాత గొప్ప సింగర్ అవుతుందని, తాను పదిరోజుల వయసు ఉన్నప్పుడే జ్యోతిష్యుడు తన జాతకం చెప్పారని వాణి జయరామ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జ్యోతిష్యులు చెప్పిన విషయాలను వెల్లడించారు. అయితే ఆయన చెప్పిన విధంగానే ఈమె ఇండస్ట్రీలో గొప్ప సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా వాణి జయరామ్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Advertisement
READ ALSO : ప్రభాస్ ఎంగేజ్మెంట్ పిక్స్… వేదిక అక్కడే… వైరల్ ట్వీట్!