దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ మూవీతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ప్రధానంగా ఇందులో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర హైలెట్ అనే చెప్పుకొవాలి.
Also Read : మీరు నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్ చూశారా..?
Advertisement
రాజమాత శివగామి పాత్రలో ఆమె నటన అత్యంత అద్భుతమం. రాజమౌళి దర్శకత్వం, రమ్యకృష్ణ నటన శివగామి పాత్రను చరిత్రలో నిలిచిపోయేవిధంగా చేసింది. ఈ పాత్ర కోసం తొలుత అనుకున్నది రమ్యకృష్ణను కాదట. ఈ పాత్ర కోసం పలువురిని సంప్రదించామని స్వయంగా జక్కన్ననే చెప్పడం విశేషం. అందులో మంచు లక్ష్మి కూడా ఒకరు. రమ్యకృష్ణ కంటే ముందు ఈ పాత్ర కోసం మంచులక్ష్మిని రాజమౌళి సంప్రదించారట. కానీ మంచులక్ష్మి నటించనని చెప్పేసిందట. అందుకు ఓ బలమైన కారణం కూడా ఉందట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచి లక్ష్మీ మాట్లాడారు.
Advertisement
Also Read : మహానటి సావిత్రి స్టార్ హీరోయిన్ రేఖకు ఏమవుతుందో తెలుసా…?
‘బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా చేసేందుకు నేను ఒప్పుకోలేదు. మనం ఒక పాత్ర పోషించిన తరువాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి హిట్ అయిన తరువాత వాస్తవానికి నేను చాలా గర్వపడ్డాను. నా జీవితం, నా కెరీర్ దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను నా కెరీర్‌లో చేసి ఐరేంద్రి లాంటి పాత్ర మరొకటి రాలేదు. ఇక మీద రాదు’ అని చెప్పుకొచ్చారు. సీనియర్‌నటుడు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు మంచు లక్ష్మి. హాలీవుడ్‌లో కూడా మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నమానస్‌స్టర్ సినిమాలో మంచి లక్ష్మి నటించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల అవ్వనుంది.
Also Read : పరశురాం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారా..?