సాధారణంగా జుట్టు ఎందుకు ఊడిపోతుంది. బట్టతల కొందరికీ ఎందుకు వస్తుంది. మగవారికే బట్టతల ఎందుకు కనిపిస్తుంది. బట్టతల వచ్చిన తరువాత మళ్లీ వెంట్రుకలు వస్తాయా ? ఇలాంటి ఎన్నో అనుమానాలు, అపోహలు మనలో చాలా మందికి ఉంటాయి. బట్టతలకు సంబంధించి కాలిఫోరియా యూనివర్సిటీకి చెందిన డెర్మాటాలజిస్ట్ కరోలిన్ గోహ్ కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు.
Advertisement
బట్టతల వంశపారపర్యంగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అయితే వాస్తవం దాని కంటే మరింత సంక్లిష్టంగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల గురించి 52వేల మంది పురుషులపై తాము అధ్యయనం చేశామని, బ్రిటీష్ పరిశోధకుల బృందం తెలిపింది. ఎక్స్ క్రోమోసోమ్ లో లోపాలే బట్టతలకు 40 శాతం కారణం ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. 287 మందిలో జుట్టు ఊడిపోవడానికి జన్యుపరమైన సమస్యలు కూడా ఒక కారణం ఈ అధ్యయనంలో గుర్తించారు. తల్లి నుంచి బలమైన జన్యువులు పిల్లలకు రావడం నిజమే అయినప్పటికీ కేవలం ఒక్క జన్యువే బట్టతలకు కారణం కాదు అని కరోలిన్ గోహ్ చెప్పారు. ఒకటికి మించిన జన్యువుల వల్ల బట్టతల వస్తుందని పేర్కొన్నారు. బట్టతలకు కారణమయ్యే జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వస్తాయని వెల్లడించారు.
Advertisement
రోజు తలస్నానం చేస్తే.. క్యాప్ లు ఎక్కువ సేపు పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. జుట్టు ఊడిపోవడానికి ఇది ఒక కారణం అని కొందరూ చెబుతూ ఉంటారు. కానీ జుట్టు ఊడిపోవడానికి ఇవేవి కారణం కాదని డెర్మటాలజిస్ట్ గోహ్ చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఉండదు. ఎందకంటే పురుషుల మాదిరిగా టెస్టోస్టిరాన్ మహిళలకు ఉండదు. దీనిని సమతుల్యం చేసేందుకు అత్యధిక మొత్తంలో ఈస్ట్రొజెన్ ఉండడమే ఇందుకు కారణం. సాధారణంగా బట్టతలను నిరోధించడానికి ప్రస్తుతం క్లినికల్ గా నిరూపితమైన మూడు పరిష్కారాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
Also Read : ఒక సారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడుతున్నారా..?అయితే, ప్రాణాలకే ముప్పు తప్పదా !!
మినోక్సిడిల్
లోషన్ల, ఫోమ్ ల రూపంలో అమ్మే దీనిని నేరుగా తల భాగానికి అప్లై చేసుకోవచ్చు. మినోక్సిడిల్ కు నోటి ద్వారా వేసుకుక్యాప్సుల్ ను తక్కువ డోస్ తీసుకోవడం కొత్తగా హెయిర్ గ్రోత్ వచ్చినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఫినాస్టెరైడ్
ఈ ఔషదాన్ని నోటితో తీసుకోవచ్చు. దీనిని మొదట ప్రొస్టేట్ పెరుగుదలకు వాడారు. ప్రస్తుతం దీనిని జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు.
ట్రాన్స్ ప్లాంట్స్
హెయిర్ ట్రాన్స్ ప్లాంట్స్ సమయంలో ఎక్కడ అయితే హెయిర్ గ్రోత్ ఉంటుందో అక్కడి నుంచి కేశాలను తీసుకొని జుట్టు లేని దగ్గర అతికిస్తుంటారు. ఇటీవల కాలంలో ఎన్నో రకాల ట్రాన్స్ ప్లాంట్ విధానాల అమల్లోకి వచ్చాయి. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్స్ విషయంలో గతంలో ఎన్నో అపోహలు ఉండేవి. ఇటీవల కాలంలో మార్పు కనిపిస్తుందని డెర్మటాలజిస్ట్ కరోలిన్ గోహ్ చెప్పారు.
Also Read : పరిగడుపున టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?