Home » చలికాలంలో కరివేపాకును మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ 6 అద్భుతమైన లాభాలు పొందవచ్చు.. !

చలికాలంలో కరివేపాకును మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ 6 అద్భుతమైన లాభాలు పొందవచ్చు.. !

by Anji
Ad

సాధారణంగా మనం ఆహారంలో అన్నింటిని సమపాలల్లో తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం. లేకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుది. మన ఆహారంలో భాగమైన కరివేపాకులను రుచి, సువాసన కోసం చాలా వంటల్లో కలుపుతారు. కానీ కరివేపాకు ఒక సుగంధ మూలిక మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు ఫైబర్, కాల్షియం, పొటాషియం, పాస్పరస్, ఐరన్, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అమినో యాసిడ్స్ ఉంటాయి. 

Advertisement

కరివేపాకు గుండె ఆరోగ్యానికి ఇన్ ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ ప్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ అనేక ఇతర గొప్ప జీర్ణక్రియ ప్రభావాలను కలిగి ఉంది. విరేచనాలను నివారించడమే కాకుండా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వారికి సాధారణ శరీర అభివృద్ధికి, ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగకరంగా ఉంటుంది. 

మధుమేహానికి.. 

Manam News

కరివేపాకు మధుమేహానికి ఎంతో సహాయపడుతుంది. కరివేపాకు మన శరీరం ఇన్సులిన్ పని తీరుపై పని చేయడం, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరుస్తుంది. కరివేపాకులో ఉండే ఫైబర్ పోషకాల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. జీవక్రియ వేగవంతం కాదు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 

కడుపు రుగ్మతలకు.. 

Manam News

కరివేపాకు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. కరివేపాకులను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్ లను ఉత్తేజపరిచి పేగు కదలికలు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ యాంటీ డయేరియా గుణాలను కలిగి ఉంటాయి. 

Advertisement

 

కొలెస్ట్రాల్ నియంత్రణకు 

Manam News

 

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ప్రీ రాడికల్స్ ద్వారా కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అని పిలవబడే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. అందువల్ల కరివేపాకు హెచ్ డీఎల్ అని పిలవబడే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. 

బరువు తగ్గడంలో.. 

Manam News

కరివేపాకు జీర్ణక్రియ ప్రక్రియను పెంచడం ద్వారా శరీరం కొవ్వును గ్రహించే విధానాన్ని మార్చడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. హానికరమైన టాక్సిన్ ని బయటికి పంపించడం, కేలరీలను బర్న్ చేయడం, కొవ్వు పెరగకుండా నిరోధించడం ద్వారా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. 

గ్రేయింగ్ ని నివారించడంలో..

Manam News

కరివేపాకు జుట్టు మెరిసిపోకుండా జుట్టు మెరవడం ఆలస్యం చేయడమే కాకుండా చుండ్రు సమస్య, జుట్టు డ్యామేజ్ ని సరి చేస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 

Also Read :   సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ల రెమ్యునరేషన్స్….ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారంటే…?

గర్భీణీలకు.. 

Manam News

గర్భం దాల్చిన మొదటి త్రైామాసికంలో మహిళలు సాధారణంగా ఎదుర్కునే సమస్య మార్నింగ్ సిక్ నెస్. గర్భిణీ స్త్రీలకు మార్నింగ్ సిక్నెస్, వాంతులను ఎదుర్కోవడానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకును తీసుకోండి ప్రయోజనాలు పొందండి. 

 Also Read :   బరువు తగ్గే ఇడ్లీ సాంబార్ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading