Home » ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రజలు అభిప్రాయం ఇదే.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..!

ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రజలు అభిప్రాయం ఇదే.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..!

by Anji
Ad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా రెండు రాష్ట్రాలు విడిపోయాయి.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరుగనున్నాయి. అధికార వైసీపీ మాత్రం నవరత్నాలు పేరుతో చేపట్టిన సంక్షేమ పథకాలు, తాము చేపట్టిన అభివృద్ధి పనులే అధికారంలోకి తీసుకొస్తాయని భావిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం మూడు రాజధానుల ప్రకటనతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు రేషనల్ సాంప్లింగ్ టెక్నిక్ పద్దతి ద్వారా సర్వే చేపట్టగా.. ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఏపీలో మ*ద్యం గురించి సర్వే : 

2024 జనవరి 01 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 3000  మందిని సర్వే చేశారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలు.. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే జరగ్గా.. అందులో  A) చాలాబాగుంది: 5%,  B) బాగుంది : 5%, C) పర్వాలేదు : 10%, D) బాగోలేదు : 30%, E) అస్సలు బాగోలేదు : 50% మంది తమ  అభిప్రాయం వ్యక్తం చేశారు.

రోడ్లు, వంతెనలు, కాలువల గురించి : 

జనవరి 05, 2024 నుంచి జనవరి 20 వరకు 25 మంది సర్వే సిబ్బంది 9000 మందిని  సర్వే నిర్వహించారు.  8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సర్వేలో..  A) చాలాబాగుంది: 5%, B) బాగుంది : 10%, C) పర్వాలేదు : 10%, D) బాగాలేదు : 25%, E) అస్సలు బాగోలేదు : 50% అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం గురించి : 

 జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 10 మంది సర్వే సిబ్బంది 6000 మందిని సర్వే చేశారు.  18 పార్లమెంట్ నియోజకవర్గాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించగా..  A) చాలా బాగుంది : 25%, B) బాగుంది : 40%, C) పర్వాలేదు : 15%, D) బాగోలేదు : 10%, E) అస్సలు బాగాలేదు : 10% అభిప్రాయం వ్యక్తం చేశారు.

యువతకు ఉపాధి అవకాశాల గురించి : 

యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధి అంశాలపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 9000 మందిని సర్వే చేశారు.  21 పార్లమెంట్ నియోజకవర్గాలు, 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలాబాగుంది : 5%, B) బాగుంది : 15%, C) పర్వాలేదు : 10%, D) బాగాలేదు : 30%, E) అస్సలు బాగాలేదు : 40% అభిప్రాయం వ్యక్తం చేశారు.

Cm Jagan

విద్యుత్ వ్యవస్థ గురించి : 

Advertisement

విద్యుత్ సరఫరా,  పంపిణీ వ్యవస్థ నిర్వహణ, విద్యుత్ ధరలు,  విద్యుత్ కోతలు నివారణ వంటి అంశాలపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 6000 మందిని సర్వే నిర్వహించారు. ఇందులో 8 పార్లమెంట్, 20 నియోజకవర్గాలు, 160 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలాబాగుంది: 10%, B) బాగుంది : 10%, C) పర్వాలేదు : 10%, D) బాగాలేదు : 25%, E) అస్సలు బాగాలేదు : 55% అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజా రవాణా గురించి : 

ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత ప్రమాణాలు, టికెట్ ధరలు నియంత్రణ వంటి అంశాలపై   జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 10 మంది సర్వే సిబ్బంది 3000 మందిని  సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే  నిర్వహించగా.. అందులో  A) చాలా బాగుంది: 25%,  B) బాగుంది : 15%, C) పర్వాలేదు : 10%,  D) బాగాలేదు : 20%,  E) అస్సలు బాగాలేదు : 30% అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల గురించి : 

ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, పిల్లలకు కల్పించే సదుపాయాలు మధ్యాహ్నభోజనం వంటి అంశాలపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 6000 మందిని సర్వే నిర్వహించారు. 20 పార్లమెంట్ నియోజకవర్గాలు, 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలాబాగుంది: 35%, B) బాగుంది : 25%, C) పర్వాలేదు : 20%, D) బాగాలేదు : 15%, E) అస్సలు బాగాలేదు : 5% అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గురించి : 

ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఔషదాలు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, అంబులెన్స్ నిర్వహణ, ఆరోగ్య శ్రీ సేవలు వంటి అంశాలపై  జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 3000  మందిని సర్వే చేశారు.  8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలాబాగుంది : 20%, B) బాగుంది : 20%, C) పర్వాలేదు : 15%, D) బాగాలేదు : 20% E) అస్సలు బాగోలేదు : 25% అభిప్రాయం వ్యక్తం చేశారు.

పారిశుధ్యం, మంచి నీటి సరఫరా గురించి : 

నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పంచాయతీలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, మురికి కాలువలు, పార్కులు, రోడ్ల నిర్వహణ, పన్నులు తదితర అంశాల గురించి   జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 6000  మందిని సర్వే నిర్వహించారు. 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలా బాగుంది : 10%, B) బాగుంది : 10 %, C) పర్వాలేదు : 20%, D) బాగాలేదు : 20%, E) అస్సలు బాగాలేదు : 40% అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్య గురించి సర్వే : 

రాష్ట్రంలో రైతులకు ఎరువుల సరఫరా, సాగునీరు, విద్యు్త్, ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధర చెల్లింపులు తదితర అంశాలపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 12,000  మందిని సర్వే నిర్వహించారు.   22 పార్లమెంట్ నియోజకవర్గాలు, 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. A) చాలాబాగుంది: 15%, B) బాగుంది : 20 %, C) పర్వాలేదు: 10%, D) బాగాలేదు : 25%, E) అస్సలు బాగాలేదు: 30% అభిప్రాయం వ్యక్తం చేశారు.

Visitors Are Also Reading