Home » గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌ల‌కు ఇది అద్భుత‌మైన చిట్కా.. పాటించి చూడండి..!

గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌ల‌కు ఇది అద్భుత‌మైన చిట్కా.. పాటించి చూడండి..!

by Anji
Ad

 

ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌తో చాలా మంది అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉదర సంబంధ వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, ఎసిడిటీ వేధిస్తున్నాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుంటే కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. తద్వారా అపాన వాయువు సమస్య వస్తుంది. ఎసిడిటీ పెరిగి పుల్లటి తేన్పులు వస్తాయి. ఒక్కోసారి భరించలేనంత నొప్పి కూడా వస్తుంది. అయితే మందులతో పనిలేకుండా దీని నుంచి ఎలా బయట పడవచ్చో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read : ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త..!

Advertisement


ఉదర సంబంధ వ్యాధులకు ఎండుద్రాక్ష చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీరు మలబద్ధకం, ఎసిడిటీ, అలసట వంటి సమస్యలుంటే ఎండు ద్రాక్ష వల్ల ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. ఎముకలు, దంతాలు రెండిటికీ ప్రయోజనం కలిగిస్తుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది.

Advertisement

Also Read : అబ్బాయిల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే తప్పకుండా అమ్మాయిలే ఇష్టపడతారు..!

ముఖ్యంగా ఎండుద్రాక్ష‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఎండు ద్రాక్షలోని పీచు.. మలబద్దకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. పొట్టను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. ఎండు ద్రాక్ష వినియోగం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒక పిడికెడు ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత వాటిని తిని, నీరు తాగితే.. శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఈ ప్ర‌యోగాన్ని ప్ర‌య‌త్నించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also Read : భార్య భర్తలు భయం లేకుండా ఈ 1 పని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..!!

 

Visitors Are Also Reading