ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలుంటే మే నెలలో ఇంకా ఏవిదంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదయం 9 గంటలు దాటితే చాలు భానుడు భగభగ మండిపోతున్నాడు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు వేసవి కాలంలో ఎండల తీవ్రతకు శరీరం తరచూ అలసిపోతుంటుంది. అలసట కారణంగా ఏ పని చేయలేకపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ టేస్ట్ ఉన్న ఎనర్జిటిక్ డ్రింక్ తీసుకుంటే మాత్రం ఇట్టే యాక్టివ్ అవ్వొచ్చు.
ముఖ్యంగా ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలంటే..? తొలుత బ్లెండర్ తీసుకుని అందులో నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పటిక, ఒక స్పూన్ బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఎండిపోయిన గులాబీ రేకలు, పావు స్పూన్ యాలకుల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్, నాలుగు ఐస్ క్యూబ్స్, ఒక కప్పు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు అయిన మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌ను యాడ్ చేస్తే సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయినట్టే లెక్క.
Advertisement
Advertisement
అయితే ఎండల వల్ల బాగా అలసిపోయినప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, కూలింగ వాటర్ వంటివి తీసుకుంటారు. వాటి బదులు ఇప్పుడు చెప్పిన డ్రింక్‌ను తయారు చేసుకుంటే మీ శరీరం వెంటనే యాక్టివ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఈ డ్రింక్‌ను తీసుకుంటే మీ శరీర ఉష్ణోగ్రతలు కూడా అదుపులోకి వస్తాయి. తలనొప్పి, నీరసం, అధిక ఒత్తిడి వంటి సమస్యలు దరి చేరవు. ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తాగేయండి.
ఇవి కూడా చదవండి :
- సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?
- నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లి పత్రిక…ఎన్టీఆర్ ఎంత కట్నం ఇచ్చారంటే..!
- గిరిజనులకు సోమవారం రోజంటే ఎందుకంత భయం.. ఏం జరుగుతుంది..!!