Home » Mega hero: మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేసే ఆ స్టార్ హీరో ఎవరు..?

Mega hero: మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేసే ఆ స్టార్ హీరో ఎవరు..?

by Sravya
Ad

Mega hero:  మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలామంది నటులకి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. దాదాపు నాలుగు ఐదు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిస్తున్నారు చిరు. సినీ ప్రేక్షకులకి చిరంజీవి అంటే అమితమైన అభిమానం. ఎంత అభిమానం అంటే కొణిదల వంశాన్ని కూడా ఆరాధించే అంత.

Also read:

Advertisement

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కొడుకు రామ్ చరణ్ తేజ్ ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు ఏ రంగంలో అయినా వివిధ వ్యక్తులు మధ్య కాంపిటీషన్ అవసరం. అప్పుడే మనిషి ఎదుగుతారు. అయితే ఒక్కొక్కసారి కాంపిటీషన్ గట్టిగా ఉన్నప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యలు వస్తాయి. ఒకే కుటుంబం నుండి వచ్చినా కూడా సమస్యలు తలెత్తుతాయి. మెగాస్టార్ వారసుడిగా చరణ్ ఎంతలా కష్టపడతాడో మనకి తెలుసు.

Advertisement

Also read:

మెగా మేనల్లుడుగా అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కష్టపడుతూ ఉంటాడు. మొన్నామధ్య మెగా కుటుంబం అభిమానులు అల్లు కుటుంబం అభిమానులు వేరుపడ్డారు. మెగా వార్ షురూ అయింది. మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ని అల్లు అర్జున్ భర్తీ చేస్తారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప టు టీజర్ చూసిన తర్వాత సో కాల్డ్ జనాలు మెగాస్టార్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది కచ్చితంగా అల్లు అర్జున్ అని పొగుడుతున్నారు. మెగాస్టార్ తర్వాత స్థానాన్ని దక్కించుకునే కేపబిలిటీ అల్లు అర్జున్ కి మాత్రమే ఉందని అందరూ విపరీతంగా పొగుడుతున్నారు రామ్ చరణ్ కి కూడా కేపబిలిటీ ఉందని ఇంకోపక్క జనం వాదిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading