Home » ఈ క్యూట్ పాప.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..?

ఈ క్యూట్ పాప.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు దేశం లో కొనసాగుతున్న చాలామంది హీరో హీరోయిన్లు చిన్నతనంలో బాలనటుడిగా చేసినవారే.. కానీ వారిని చూస్తే చాలా మంది గుర్తుపట్టలేరు.. ఎందుకంటే బాలనటుడిగా చేసి వారు మళ్లీ కొద్దీ సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమై చివరికి హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ కింద క్యూట్ గా ఉన్న ఈ పాప ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాల నటిగా మంచి గుర్తింపు సాధించింది.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.. మరి ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.. కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా, లేదంటే ఇతరాత్ర ఇంటర్వ్యూలలో పాల్గొన్న సందర్భంలో వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.

Advertisement

సోషల్ మీడియా వేదికగా వారి ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ అందరిని ఆశ్చర్య పరుస్తారు.. ప్రస్తుతం అలాగే ఈ క్యూట్ బేబీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. కాశ్మీరీ మైదానంలో బిందె పట్టుకొని ఉన్న ఈ చిన్నారి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. ఇంకా మీకు గుర్తుకు రాలేదు కదూ. మరి పూర్తి వివరాలు చూడండి.. ఆనాటి చిన్నారి బేబీ ఎవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి… అందాల రాక్షసి మూవీ ద్వారానే తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని తో భలే భలే మగాడివోయ్ మూవీ లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది..

Advertisement

ఆ తర్వాత వరుసగా సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు,ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాల్లో సక్సెస్ సాధించింది లావణ్య త్రిపాటి. ఈమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తాజాగా లావణ్య త్రిపాటి నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మరో చిత్రంలో లావణ్య త్రిపాటి సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతోంది.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే కానీ పూర్తి వివరాలు ఏంటి అనేది తెలియవు.

ALSO READ:

Visitors Are Also Reading