Telugu News » Blog » స్వామి వివేకానంద గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!

స్వామి వివేకానంద గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!

by Anji
Ads

Swami Vivekananda Jayanthi :  స్వామి వివేకానంద గురించి అసలు పరిచయం చేయాల్సిన అసవరమే లేదు. ప్రతి రోజు ఏదో ఓ సందర్భంలో వివేకానందుడిని తలుచుకుంటూనే ఉంటుంటారు. ముఖ్యంగా భారతదేశ ఖ్యాతిని తన ఉపన్యాసాల ద్వారా ఖండాంతరాలు దాటించిన గొప్ప వ్యక్తి. అమెరికాలోని చికాగో, ఇంగ్లాండ్ లో వివేకానంద చేసిన ప్రసంగాల గురించి నేటికి భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద కావడం విశేషం. వివేకానంద సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇవాళ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read:  Best Motivational and Inspirational Quotes and in Telugu, తెలుగు కొటేషన్స్ 

 

స్వామి వివేకానంద కోల్ కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మనించాడు. ఇతని అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. చిన్నప్పటి నుంచే ఆటల్లో, చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. ఏక సంథాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపకశక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విషయాన్ని అయినా ఇట్టే పసిగట్టేవాడట. 1880లో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. ఆ తరువాత తత్వశాస్త్రం, పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించాడు. ఇదే సమయంలో సత్యాన్వేషణ కోసం తన సందేహాలను చాలా మంది పండితుల ముందు పెట్టాడు. కానీ ఎవ్వరి సమాధానాలు కూడా ఆయనకు సం తృప్తినివ్వలేదట. 

Also Read :  Swami Vivekananda Quotes, Quotations in Telugu: విజయానికి స్ఫూర్తి.. వివేకానంద సూక్తులు

 

“ఇనుప నరాలు,ఉక్కు కండరాలు ఉన్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను” అని పేర్కొన్నారు స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్ తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉన్నదని వందేళ్ల కిందటే గుర్తించిన మహానీయుడు వివేకానంద. ఆధునిక భారతదేశం ప్రపంచంలోనే ఒక మహత్తర శక్తిగా ఎదిగేందుకు ఆయన పటిష్టమైన పునాదులు వేశారు. మేధా సంపత్తిలో భారతీయులు ఎవ్వరికీ కూడా తక్కువ కాదు అని నిరూపించడం ద్వారా. ప్రధానంగా భారతీయ యువతరంలో చైతన్యం నింపేందుకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి జీవతాంతం కృషి చేశారు. ఆలోచన పటిమ, నిర్ణయ సామర్థ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితాలను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్టించడానికి వివేకానంద ఎంతో ప్రయత్నించారు. ముఖ్యంగా భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెరగని పరిశ్రమ చేసారు. 

Advertisement

ముఖ్యంగా ఏ దేశంలో అయినా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదని.. యువజనులు అందరూ మనస్పూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యం అవుతుందని వివేకానందుడు భావించేవాడు. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన అభివృద్ధి చెందిన దేశాల్లో యువతరానికి భారతీయ యువతరానికి ఆలోచన విధానంలో, మనస్తత్వంలో ఉన్న భేదాలను క్షుణ్ణంగా గమనించారు. భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల కన్నా అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరైన ఆలోచనా దృక్పథం లేకపోవడం వివేకానంద భావించారు. పలు ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరాన్ని ఉత్తేజ పరిచి దిశానిర్దేశం చేశారు.  ఇప్పుడు వివేకానందకి సంబంధించిన కొన్ని కొటేషన్స్  మనం చూద్దాం. 

Swami Vivekananda Quotes in Telugu Images

 

 

Best vivekananda quotes and quotations in telugu (5)

quotes and quotations in telugu

Best vivekananda quotes and quotations in telugu

Advertisement

Best vivekananda quotes and quotations in telugu

Best vivekananda quotes and quotations in telugu

Best vivekananda quotes and quotations in telugu