టాలీవుడ్ లో ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలనటుడిగా చేసి తర్వాత తెరమరుగైన వారు ఎందరో ఉన్నారు.. అప్పుడప్పుడు వారు సోషల్ మీడియాలో ప్రస్తుత ఫోటోలు పెడితే అప్పటి వారిని ఇప్పుడు చూస్తే చాలామంది షాక్ కి గురవుతారు.. అయితే బాలనటుడిగా చేసి చాలామంది కెరియర్ ను అక్కడే స్టాప్ చేశారు.. కానీ కొందరు మాత్రమే ప్రస్తుతం స్టార్ హీరోలుగా. కొనసాగుతున్నారు.. వారెవరో చూద్దాం..? మహేష్ బాబు నుండి అఖిల్ వరకు ఇలా ఎందరో బాలనటులుగా చేసి మెప్పించిన వారే..మహేష్ బాబు :
ఈయన బాలనటుడిగా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.. బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, శంఖారావం, అన్న తమ్ముడు, ముగ్గురు కొడుకులు లాంటి అనేక సినిమాలు చేశారు. ప్రస్తుతం స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్నారు.
Advertisement
విక్టరీ వెంకటేష్:
వెంకటేష్ 1971లో ప్రేమనగర్ మూవీ లో చిన్నప్పటి ఏఎన్ఆర్ పాత్రని చేశారు. దీని తర్వాత మళ్లీ ఆయన బాలనటుడిగా చేయలేదు. దీని తర్వాత కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
కళ్యాణ్ రామ్ :
1989లో విడుదలైనటువంటి బాలగోపాలుడు మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. దీని తర్వాత ఆయన ఏ సినిమాలో బాలనటుడిగా చేయలేదు. తొలిచూపులోనే అనే సినిమాతో హీరోగా మారారు కళ్యాణ్ రామ్.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్ ముందుగా రామాయణం చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముని గా చేసి అందరినీ మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
తరుణ్ :
మనసు మమత, అంజలి,తేజ, పిల్లలు దిద్దిన కాపురం వంటి మూవీస్ లో బాలనటుడిగా చేసిన తరుణ్ నువ్వే కావాలి మూవీ తో హీరో గా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఉత్తమ బాల నటుడిగా చాలా నంది అవార్డులు కూడా పొందారు.
అఖిల్ :
1994లో విడుదలైన టువంటి సిసింద్రీ సినిమా లో కేవలం నెలల వయస్సు ఉన్నప్పుడే నటించినటువంటి ఘనత అఖిల్ కి మాత్రమే సాధ్యమైంది. 2014లో మనం చిత్రం లో కనిపించిన అఖిల్, 2017 అఖిల్ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
also read;
“నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?