Home » ‘ఆ నలుగురు’ సినిమా స్టోరీ ప్రకాష్ రాజ్ కి చెబితే అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు ? ఎందరు రిజెక్ట్ చేసారంటే ?

‘ఆ నలుగురు’ సినిమా స్టోరీ ప్రకాష్ రాజ్ కి చెబితే అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు ? ఎందరు రిజెక్ట్ చేసారంటే ?

by AJAY
Ad

శుక్ర‌వారం వ‌చ్చిందంటే ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే చిర‌కాలం ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల‌లో ఆ న‌లుగురు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాకు క‌థ‌నే హీరో కాగా ఇందులో రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించారు. మ‌ద‌న‌ప‌ల్లికి స‌మీపంలోని బి కొత్త‌పేట అనే గ్రామంలో జ‌రిగిన నిజ సంఘ‌ట‌న‌ల ఆదారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు మ‌ద‌న్ క‌థ‌ను అందించాడు.

Advertisement

త‌ను విన్న చూసిన క‌థ‌నే మ‌ద‌న్ సినిమాగా మాల‌చాలి అని క‌ల‌లు క‌న్నాడు. ఈ సినిమా క‌థ‌కు అంతిమ‌యాత్ర అనే టైటిల్ ను అనుకున్నాడు. మొద‌ట సీరియ‌ల్ గా తీయాల‌నుకుని ఈటీవీ ఆఫీస్ కు వెళ్ల‌గా అక్క‌డ రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు రామ్ ప్ర‌సాద్ మ‌ద‌న్ కు ప‌రిచయం అయ్యాడు. అత‌డికి క‌థ విప‌రీతంగా న‌చ్చేసింది. దాంతో వెంట‌నే నిర్మాత‌ అట్లూరి పూర్ణ‌చంద‌ర్ రావు వ‌ద్ద‌కు వెళ్లి క‌థ‌ను వినిపించారు. ఆయ‌న‌కు కూడా క‌థ బాగా న‌చ్చేసింది.

Advertisement

ఇక క‌థ విన‌గానే ఆయ‌న మ‌దిలో దాస‌రితో ఈ సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఆయ‌న రిజెక్ట్ చేస్తే మోహ‌న్ బాబు తో చేయాల‌నుకున్నాడు. చేస్తే వీరిద్ద‌రితోనే చేయాల‌నుకున్నాడు. వీరిద్ద‌రూ రిజెక్ట్ చేస్తేనే మ‌రో ఆప్ష‌న్ కు వెళ్లాల‌ని అనుకున్నాడు. ఇద్ద‌రూ రిజెక్ట్ చేయ‌డంతో మ‌ద‌న్ ఈ క‌థ‌ను ప్ర‌కాష్ రాజ్ కు వినిపించాడు. కానీ ప్ర‌కాష్ రాజ్ ఇది సినిమా కంటే న‌వ‌ల గా బాగుంటుందేమో ఆలోచించు అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చాడు.

చివ‌రికి ఈ సినిమా రైట్స్ ను అట్లూరి నుండి దర్శ‌క నిర్మాత‌ చంద్ర‌సిద్దార్థ్ కొనుగోలు చేశాడు. మ‌ద‌న్ ఈ సారి రాజేంద్ర‌ప్ర‌సాద్ కు క‌థ‌ను చెప్పాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ వెంట‌నే ఈ సినిమాను ప‌ట్టాలెక్కిద్దామ‌ని చెప్పాడు. అలా ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading