Telugu News » Blog » “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

“నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by AJAY
Ads

విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో పాటు మధ్య మధ్యలో లవ్ ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో నటించిన ప్రకాష్ రాజ్, సునీల్ క్యారెక్టర్ లతోపాటు పింకీ క్యారెక్టర్ కూడా హైలెట్ గా నిలిచింది. సినిమా లో పింకీ అనే పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సుదీప. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ కు బాబాయ్ గా నటించిన ఎమ్ ఎస్ నారాయణ కూతురిగా నటించి పింకీ ఆకట్టుకుంది.

Also Read: అస‌లు అల్లు అర్జున్‌కు ఏమైంది.. ఇలా మారాడంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజ‌న్లు..!

పింకీ ఆర్తి అగర్వాల్ పై వేసే పంచ్ లు చేసే కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచి పోయాయి. దాంతో ఈ సినిమాతో సుదీపకు ఎంతో గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా ఆమె పేరునే అంతా పింకీ గా గుర్తు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత సుదీప బొమ్మరిల్లు, స్టాలిన్, మిస్టర్ పర్ఫెక్ట్, బిందాస్, లెజెండ్ లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు సుదీప టీవీ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.

Also Read:ఛత్రపతి” రీమేక్ టైటిల్ కోసం మేకర్స్ తిప్పలు…!

nuvvu naaku nacchav movie

nuvvu naaku nacchav movie

కానీ చాలా కాలంగా సుదీప సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని సుదీప హైదరాబాద్ లో సెటిల్ అయింది. సుదీప భర్త పేరు రంగనాథ్ కాగా అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి….. అంతేకాకుండా సుదీప కూడా ఎంబీఏ వరకు చదువుకుంది. ఇదిలా ఉండగా సుదీప లేటెస్ట్ ఫోటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో సుదీప ఎంతో అందంగా కనిపించడంతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి సుదీప రీఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Also Read: విక్రమ్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…రోలెక్స్ విలన్ కాదట హీరో…?


You may also like