Home » ప్రభాస్ లవ్ ఫెయిల్ కావడానికి కారణం వారేనా?

ప్రభాస్ లవ్ ఫెయిల్ కావడానికి కారణం వారేనా?

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో. అదేవిధంగా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. వాస్తవానికి ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. తన వయస్సు కూడా 45 ఏళ్లకు వచ్చేసింది. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి చాలాసార్లు జరిగిపోయింది. ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్ తో ప్రభాస్ కి నెటిజన్లు పెళ్లి చేసేస్తున్నారు. 

Also Read :  సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!

Advertisement

ఇప్పటికే అనుష్కతో ఒకసారి  కృతిసనన్ తో మరోసారి ప్రభాస్ పెళ్లి చేశారు నెటిజన్లు. ప్రభాస్ కి ఇండస్ట్రీలో ముందు త్రిషతో ఆ తరువాత అనుష్కతో ఇటీవల కృతిసనన్ తో లవ్ ఎఫైర్ ఉందని పేర్కొంటున్నారు. పలు కారణాల వల్ల ఈ హీరోయిన్లతో ప్రభాస్ విడిపోయాడని చెబుతుంటారు. ప్రభాస్ కి తొలుత త్రిష అంటే ఇష్టముండేదట. ఆయన కూడా తనపై మనస్సు పడ్డారట. అందుకే తనకు వర్షం తరువాత మరో రెండు సినిమాల్లో అవకాశం ఇప్పించాడు ప్రభాస్.  

Advertisement

కొద్ది సంవత్సరాల తరువాత తాను కోలీవుడ్ హీరో విజయ్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. దీంతో మరో సినిమాలో త్రిషతో నటించే అవకాశం వచ్చినా తనను వద్దని వేరే హీరోయిన్ ని తీసుకోవాలని దర్శకుడికి సూచించాడట ప్రభాస్. వీరిద్దరూ అప్పటి నుంచి బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ప్రభాస్ అనుష్కతో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపించాయి. ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్,కృతిసనన్ మధ్య ప్రేమ చిగురించినట్టు వార్తలు వచ్చాయి. ఇలా ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిచినప్పటికీ చివరికీ ప్రభాస్ ముగ్గురిలో ఎవ్వరినీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. 

Also Read :  సౌంద‌ర్య చనిపోతుంద‌ని ముందే తెలుసా…ఆమె జాతకంలో ఉన్న షాకింగ్ నిజాలు ఇవే..!

Visitors Are Also Reading