పెళ్లికి ముందు ఎవరు ఎలా ఉన్నా అంతగా ఎవ్వరు పట్టించుకోరు. ముఖ్యంగా వివాహం జరిగిన తరువాత ఆ దంపతులు ఎలా ఉన్నారని అందరూ అడుగుతుంటారు. కొంత మంది పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తరుచూ గొడవలు పడుతుంటారు. మరికొందరూ గొడవలు మాత్రమే కాకుండా విడాకుల వరకు కూడా వెనుకాడరు.
Advertisement
ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబం కలిసి మెలిసి ఉండడంతో ఇలాంటి సమస్యలు అసలు వచ్చేవి కావు. కానీ ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కొందరి కాపురాలుకూడా కూలిపోతున్నాయి. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాపురాలు కూలడానికి మెయిన్ రీజన్స్ ఒకటంటే ఏమి ఉండదు. ఎవరికీ వాళ్లదే మెయిన్ రీజన్ అని అనుకుంటారు. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. కాపురాలు కూలకుండా ఉండడానికి ఏమి అవసరం అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ప్రతి భార్య, భర్తకు మూడు ఫ్యాక్టర్స్ చాలా అవసరమవుతాయి. ఇక రకరకాల కారణాలుంటాయి. ఒక్కటని చెప్పలేము. ఈ మధ్య కాలంలో బాధ్యత లేదని.. నన్ను పట్టించుకోదని.. వారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. హెల్ప్ చేయడం లేదని.. రెస్పాన్స్ ఇవ్వడం లేదని.. చిన్నవాటిని పెద్దవి చేసుకోవడం లాంటివి చాలా రీజన్స్ ఉంటాయి.
Advertisement
అసలు వారిలో ఏమి లేకపోవడం వల్ల ఈ చిన్నవే పెద్దవి అవుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. నీకు నేను ఉన్నాననే ఫీలింగ్ ఇవ్వలేకపోవడం అసలు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలై వాదించుకోవడం వంటివి జరుగుతుంటాయి. డబ్బు గురించి, లేదా చీటింగ్ గురించి ఇలా దేని గురించి అయినా అవ్వవచ్చు. నాకు నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్ వారికి వస్తే ఇక తగాదాకు అక్కడే దారి తీస్తుంది. దేని కోసమైనా నాకు తాను ఉన్నాడు లేదా నాకు తను ఉంది ఒక భరోసాను ఒకళ్లకొకరు ఇచ్చుకోలేకపోవడం వల్లనే ప్రతిదీ వారి మధ్య తగాదా వస్తుందనే చెప్పవచ్చు.
Also Read :
లవర్ కోసం బంగ్లాదేశ్ నుండి ఇండియాకు ఈదుకుంటూ వచ్చిన అమ్మాయి..!