Telugu News » Blog » ల‌వ‌ర్ కోసం బంగ్లాదేశ్ నుండి ఇండియాకు ఈదుకుంటూ వ‌చ్చిన అమ్మాయి..!

ల‌వ‌ర్ కోసం బంగ్లాదేశ్ నుండి ఇండియాకు ఈదుకుంటూ వ‌చ్చిన అమ్మాయి..!

by Anji
Ads

సాధార‌ణంగా ప్రేమ అంటే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. కొంత మంది ఒక ప్రాంతం వారు, కొంత మంది ప్రాంతాల వారు ప్రేమించుకుంటారు. అయితే కొంత మంది ఎవరైనా రాష్ట్రం వారు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక దేశానికి చెందిన అమ్మాయి మరొక దేశానికి అబ్బాయిని ప్రేమించడం చాలా అరుదు. కానీ ఇక్క‌డ వారిద్ద‌రూ ఎంత‌లా ప్రేమించుకున్నారంటే.. ల‌వ‌ర్ కోసం ఎవ‌రూ చేయ‌ని రిస్క్ చేసింది ఆ అమ్మాయి. ప్రేమకోసం ఏకంగా త‌మ‌ దేశ స‌రిహ‌ద్దుల‌నే దాటి భార‌త్‌లోకి ప్ర‌వేశించింది. ఆ త‌రువాత సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.

ప్రేమ కోసం భార‌త్‌కు వ‌చ్చినా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండ‌ల్ (22) అనే యువ‌తి త‌న ప్రియుడి కోసం ఏకంగా దేశ స‌రిహ‌ద్దుల‌నే దాటేసింది. ఫేస్‌బుక్ ద్వారా కోల్‌క‌తాకు చెందిన అభిక్ మండ‌ల్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌ని స‌రిహ‌ద్దుల్లో రాయ‌ల్ బెంగాల్ పులుల నివాసమైన ద‌ట్ట‌మైన సుంద‌ర్భ‌న్ అడ‌వుల గుండా ప్ర‌యాణించి దాదాపు గంట సేపు న‌దిలో ఈది భార‌త్‌లోకి ప్ర‌వేశించింది. కోల్‌క‌తాలోని కాళీఘాట్ ఆల‌యంలో మూడు రోజుల క్రితం ఈమె అభిషేక్‌కు పెళ్లి కూడా చేసుకుంది.

 

 

భార‌త‌దేశంలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించింది అనే నేరంపై పోలీసులు కృష్ణ‌మండ‌ల్‌ను అరెస్ట్ చేశారు. తిరిగి ఆమెను బంగ్లాదేశ్ హై క‌మిష‌న‌ర్‌కు అప్ప‌గిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. గ‌తంలో ప‌లుమార్లు ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయిన వారి కోసం ప్రేమికులు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులు దాటి భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌డం.. భార‌త్ నుండి అక్ర‌మంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ దేశాల‌కు వెళ్లిన ఘ‌ట‌న‌లున్నాయి. కొద్ది నెల‌ల క్రితమే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఇదేవిధంగా త‌న‌కు ఇష్ట‌మైన చాక్లెట్ కోసం స‌రిహ‌ద్దుల్లో న‌దిని ఈది భార‌త్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విధిత‌మే. ఆ బాలుడిని కూడా జ్యూడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. అయితే త‌మ‌కు ఇష్ట‌మైన వారి కోసం బంగ్లాదేశ్ యువ‌తి, యువ‌కులు ఎంత‌టి సాహ‌సానికైనా వెనుకాడ‌ర‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ప్రేమ వ్య‌వ‌హారాలు మ‌రీ ఎక్కువ అయిపోయాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ల‌వ‌ర్ కోసం బంగ్లాదేశ్ నుంచి భార‌త్‌కు వ‌చ్చిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకోవ‌డం విశేషం.

Also Read : 

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

RRR లో రామ్ చరణ్ అలా చేస్తే సూపర్ అనుకున్నాం..! కానీ వెనుక అసలేం లేదా ? అంత ఉత్తదేనా..!

 


You may also like