ప్రస్తుత సమాజంలో అక్రమసంబంధాలు పెరిగిపోయాయి. కొంతమంది పెళ్లికి ముందే ప్రేమించి ఆ తరవాత పెళ్లి చేసుకుని కూడా ప్రేమించినవాళ్లతో రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నారు. మరి కొందరు పెళ్లి తరవాత అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ప్రభావంతో కూడా అక్రమసంబంధాలు పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు అక్రమసంబంధాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలా రోజుకు ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి.
Advertisement
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు కూడా పెరిగిపోయాయి. ఏం చేయకపోయినా అనుమానం వల్ల విడిపోతున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రమే భార్యలు భర్తలను …భర్తలు భార్యలను అనుమానించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….ఇతరుల మోజులో పడిన వాళ్లు అప్పటి వరకూ సింపిల్ గా ఉన్నా ఆ తరవాత ఎక్కువగా రెడీ అవుతుంటారట.
Advertisement
ఏజ్ పెరిగినా అందం పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలా ప్రవర్తిస్తే అనుమానించవచ్చట. ఇదివరకూ ఫోన్ లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేసిన మాట్లాడినవాళ్లు ఆ తరవాత ఫోన్ వస్తే ఆందోళన చెందడం..పక్కకి వెళ్లి మాట్లాడటం..గంటలు గంటలు మాట్లాడం లాంటివి చేసినా అనుమానించాలట. అప్పటి వరకూ ఎంతో ప్రేమగా చూసుకున్నవాళ్లు ఆ తరవాత ద్వేషించడం, చిరాకుపడటం లాంటివి చేసినా అనుమానించవచ్చట.
ప్రతిరోజూ ఆఫీసు నుండి టైమ్ కు వచ్చేవారు ఆ తరవాత ఆఫీసు నుండి లేటుగా రావడం…వచ్చినా భాగస్వామిని పట్టించుకోకపోవడం లాంటివి చేసినా అనుమానించాలట. అంతే కాకుండా ఇది వరకూ భాగస్వామితో రొమాంటిక్ జీవితాన్ని సంతోషంగా గడిపినవాళ్లు ఆ తరవాత భాగస్వామితో దూరంగా ఉండటం..ఆసక్తి చూపకపోవడం లాంటివి చేసినా అనుమానించాలట. అయితే ఇలాంటివి భాగస్వామిలో కనిపించినప్పటికీ సరైన ఆధారాలు దొరికేవరకు తొందరపాటు నిర్నయాలు తీసుకోవద్దట.
ALSO READ :
ఆషాఢమాసం లో భార్య భర్తలు ఎందుకు కలుసుకోవద్దు..? కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా…!
హీరో సుమన్ పెళ్ళిలో చిరంజీవి సందడి…..వైరల్ అవుతున్న ఫోటోలు…!