Home » టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే..!

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే..!

by Anji

సాధారణంగా క్రికెట్ లోని  వన్డే, టెస్ట్, టీ20 ఇలా ఏ ఫార్మాట్ అయినా సరే కెప్టెన్ కి మిగతా ఆటగాళ్ల కంటే కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఫీల్డ్ లో విషయాలను నియంత్రించే వ్యక్తిగా కెప్టెన్ ని చూస్తుంటాం. అదేవిధంగా సరైన సమయంలో ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకునే బాధ్యత కూడా కెప్టెన్ పైనే ఉంటుంది. చరిత్రలో చాలా మంది విజయవంతమైన కెప్టెన్లు ఉంటారు. అదే సమయంలో చాలా చిన్న వయసులో కూడా కెప్టెన్లు అయిన ఆటగాళ్లున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన 10 మంది కెప్టెన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

రషీద్ ఖాన్ 

Rashid Khan : Manam News

అప్గానిస్తాన్ వెటరన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్. కేవలం 20 సంవత్సరాల 350 రోజుల వయస్సులోనే కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. 2019 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతనికీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 

తాటెండ తైబు 

Tatenda Taibu : Manam News

ఇతను జింబాబ్వే కీలక ఆటగాడు. తటెండతైబు కేవలం 20 ఏళ్ల 358 రోజుల వయస్సులో కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. హరారేలో శ్రీలంక తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మే 06, 2004న టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. 

 

నవాబ్ పటౌడీ 

Manam News

భారత మాజీ కెప్టెన్ నవాబ్ మసూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించినప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 77 రోజులు. 

వకార్ యూనిస్ 

manam News

 

పాకిస్తాన్ వెటరన్ బౌలర్ వకార్ యూనిస్ కేవలం 22 ఏళ్ల 15 రోజుల వయసులో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ అవకాశాన్ని అందుకున్నాడు. 

గ్రేమ్ స్మిత్ 

Manam News

దక్షిణాఫ్రికా మాజీ వెటరన్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టే నాటికి అతని వయస్సు 22 సంవత్సరాల 82 రోజులు. 

షకీబ్ అల్ హసన్ 

Shakib Al Hasan Named Bangladesh Captain - Sakshi

బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ 22 ఏళ్ల 115 రోజుల వయస్సులో కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అతను జులై 17, 2009న వెస్టిండీస్ పై తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించాడు. 

Also Read :  ఐపీఎల్ లో ఇంకా జట్లు పెరగనున్నాయా..?

ఇయాన్ క్రెయింగ్ 

manam News

ఆస్ట్రేలియా కి చెందిన ఇయాన్ క్రెయింగ్ 22 ఏళ్ల 194 రోజుల వయస్సులో కెప్టెన్సీని అందుకున్నాడు. అతను డిసెంబర్ 23, 1957న దక్షిణాఫ్రికా పై జోహన్నెస్ బర్గ్ లో కెప్టెన్సీగా ఆరంగేట్రం చేసాడు. 

 

జావేద్ మియాందాద్ 

Manam News

పాక్ వెటరన్ జావేద్ మియాందాద్ 22 ఏళ్ల 260 రోజుల వయస్సులో కెప్టెన్ అయ్యాడు. 

Also Read :   ఫిఫా ప్రపంచ కప్ లో అతి పెద్ద సంచలనం.. 36 విజయాల రికార్డుకి చెక్..!

ముర్రె బిస్సెట్ 

Manam News

దక్షిణాఫ్రికా ఆటగాడు 22 ఏళ్ల 306 రోజుల వయస్సులో కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 

 

మహమ్మద్ అష్రాపుల్ 

బంగ్లాదేశ్ మాజీ వెటరన్ ఆటగాడు మహ్మద్ అష్రాపుల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు అతని వయస్సు కేవలం 22 ఏళ్ల 353 రోజులు 

 Also Read :   20 ఏళ్ల రికార్డును చెరిపేసిన వార్నర్.. 1043 రోజుల తరువాత సెంచరీ..!

Visitors Are Also Reading