Home » ఐపీఎల్ లో ఇంకా జట్లు పెరగనున్నాయా..?

ఐపీఎల్ లో ఇంకా జట్లు పెరగనున్నాయా..?

by Azhar
Ad

క్రికెట్ లోనే నెంబర్ వన్ లీగ్ గా కొనసాగుతున్న ఐపీఎల్ అనేది 2008 లో మొదట 8 జట్లతో మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అనేది సాధించింది. అలాగే బీసీసీఐకి ఎంతో ఆదాయం తెచ్చింది. మొత్తం 14 సీజన్లు 8 జట్లతోనే నడిచిన ఈ లీగ్ అనేది ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లో మరో రెండు కొత్త జట్లను తీసుకువచ్చింది.

Advertisement

దాంతో ప్రస్తుతం ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్ తర్వాత జరిగిన మీడియా రైట్స్ వేలంలో ఐపీఎల్ కు ఇంకా క్రేజ్ అనేది పెరిగింది. దాంతో వచ్చే ఏడాది ఇంకా జట్లు అనేవి చేరనున్నాయి అనే వార్త వచ్చింది. కానీ తాజాగా ఈ విషయంలో ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధూమల్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ఆయన మాట్లాడుతూ… ఐపీఎల్ లో ఇంకా జట్లు అనేవి పెరగవు. ప్రస్తుతం మన 10 జట్లతో సీజన్ జరుపుతున్నాము. ఒకవేళ ఇంకా జట్లు అనేవి పెరిగితే లీగ్ నిర్వహణ కూడా కష్టం అవుతుంది. అందుకే జట్లు పెరగవు కానీ.. మ్యాచ్ ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో 74 మ్యాచ్ లు అనేవి జరుగుతున్నాయి. కానీ ఐపీఎల్ 2023 లో 84 అవుతాయి. ఆ తర్వాత సీజన్ లో కూడా ఇంకా పెంచుతాం అని అరుణ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కు గాయం.. సెమీస్ ఆడుతాడా.. లేదా..?

భారత విజయాల వెనుక రహస్యం ఇదే..!

Visitors Are Also Reading