Home » ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ చేసి ఓడిపోయిన టాప్ 5 టీమ్ లు ఇవే..!

ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ చేసి ఓడిపోయిన టాప్ 5 టీమ్ లు ఇవే..!

by Anji
Ad

ఐపీఎల్ 2023 అనగా 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే రివైండ్ లో భాగంగా అత్యధిక పరుగులు చేసిన తరువాత ఓటమిని ఎదుర్కొన్నటువంటి టాప్ 5 మ్యాచ్ లు, ఆయా జట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :   సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Advertisement

Manam News

ఇక ఈ జాబితాలో మొదటి పేరు పంజాబ్ కింగ్స్ టీమ్ నిలిచింది. సెప్టెంబర్ 27, 2020 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కి 224 పరుగుల భారీ స్కోరు లక్ష్యాన్ని అందించింది. అయితే రాజస్థాన్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  పంజాబ్ జట్టు అద్భుతమైన ఆట కనబరిచినప్పటికీ.. రాజస్థాన్ టీమ్ ఎక్కడ తడబడకుండా అలవొకగా విజయం సాధించింది. 

Also Read :  21 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన సంజు శాంసన్

Manam News

అదేవిధంగా రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. మే 01, 2021 ముంబై పై చెన్నై జట్టు 218 పరుగులు చేసింది. అయితే ముంబై జట్టు మొత్తం 20 ఓవర్లలో చెన్నైపై 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్ లో విజయం సాధించింది.

Advertisement

Manam News

ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ గా కొనసాగుతోంది. ఈ జట్టు మూడో స్థానంలో ఉంది. ఏప్రిల్ 24, 2008న ఈ జట్టు రాజస్థాన్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. 

Also Read :  బాల‌య్య ఒక్క‌డే మా కుటుంబం…తార‌క‌ర‌త్న భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Manam News

చెన్నై సూపర్ కింగ్స్ పేరు మరోసారి నాలుగో స్థానంలో కూడా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఈ జట్టు మార్చి 31, 2022న లక్నో ముందు చెన్నై 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Manam News

గుజరాత్ లయన్స్ పేరు ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. మార్చి 04, 2017న ఢిల్లీ డేర్ డెవిల్స్ ముందు గుజరాత్ లయన్స్ జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ జటటు 07 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

  Also Read :   Virat Kohli : 1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ

Visitors Are Also Reading