Telugu News » Blog » సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

by Bunty
Ads

ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన సూపర్ సెంచరీ తో క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్ మన్ వంటి దిగ్గజాల తర్వాతి స్థానం తన సొంతం చేసుకున్నాడు. కోహ్లీ దాదాపు మూడేళ్ల పాటు సాగిన టీమిండియా అభిమానుల నిరీక్షణకు టీమిండియా కింగ్ కోహ్లీ ముగింపు పలికాడు. నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో మెరిసాడు.

Advertisement

READ ALSO : చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!

Advertisement

ఫలితంగా సెంచరీ కోసం సాగిన 1205 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు కోహ్లీ ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే ఈ టెస్ట్ లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ సంబరాలు చూశారా? మూడంకెల స్కోర్ కు చేరుకోగానే తన మెడలోని లాకెట్ తీసి ముద్దులు పెడుతూ కనిపించాడు కోహ్లీ. గతేడాది టీ20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై తొలి టీ20 సెంచరీ చేసినప్పుడు కూడా లాకెట్ ను ముద్దాడాడు. అయితే విరాట్ ఇలా లాకెట్ ను ముద్దాడడం వెనక ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇది నిజానికి లాకెట్ కాదు, అతని పెళ్లి ఉంగరం.

READ ALSO : Virat Kohli : 1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ

Is Virat Kohli sick during 4th Test? Anushka Sharma makes huge reveal as Kohli scores memorable ton

 

 

తన సతీమణి అనుష్క శర్మపై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం అని పలు సందర్భాల్లో చెప్పుకోచ్చారు. అందుకే సెంచరీ చేసినప్పుడల్లా తన సతీమణిని గుర్తుతెచ్చుకుంటూ ఈ లాకెట్ ను ముద్దు పెట్టుకుంటాడట కోహ్లీ. కాగా ఈ వరుస సెంచరీల ముందు కోహ్లీ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు ఫామ్ లేమితో తంటాలు పడ్డాడు. కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్కనే తనకు అండగా నిలిచిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Advertisement

READ ALSO : రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారా? దీని వెనుక ఉంది ఎవరు?