Telugu News » Blog » 21 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన సంజు శాంసన్

21 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన సంజు శాంసన్

by Bunty
Ads

 

టీమిండియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గురించి తెలియని వారుండరు. అయితే, తాజాగా, సంజు శాంసన్ కు సంబంధించి 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏడేళ్ల వయసు నుంచి తన ఆరాధ్య కథానాయకుడు రజినీకాంత్ ను కలవాలనుకున్న సంజు కల ఎట్టకేలకు మార్చి 12 2023న నెరవేరింది. సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ను అతని స్వగృహంలోనే కలుస్తానని సంజు చిన్నతనంలో తల్లిదండ్రులతో శపథం చేశాడట. 21 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు సంజు శపథం నెరవేరింది. నిన్న సంజు శాంసన్ ను రజనీకాంత్ తన స్వగృహానికి ఆహ్వానించారు.

Advertisement

READ ALSO : రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారా? దీని వెనుక ఉంది ఎవరు?

Advertisement

ఈ సందర్భంగా రజినీకాంత్ సంజు మెడలో శాలువ వేసి సత్కరించాడు. ఈ విషయాన్ని సంజు ట్విట్టర్ వేదికగా షేర్ చేసి తన అవధులు లేని ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. కాగా, కేరళకు చెందిన 28 ఏళ్ల సంజు శాంసన్ కు చిన్నతనం నుంచి రజినీకాంత్ అంటే పిచ్చ అభిమానం ఉండేది. గతంలో చాలా సందర్భాల్లో సంజు స్వయంగా ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు.

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Sanju Samson | Twitter Topics / Twitter

కరోనా లాక్ డౌన్ సమయంలో పుస్తక పఠనం, మెడిటేషన్ తో పాటు తనకెంతో ఇష్టమైన రజనీకాంత్ సినిమాలు, మలయాళం సినిమాలతో కాలం వెళ్ళబుచ్చానని సంజు ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే సంజు శాంసన్ ఇటీవల కాలంలో మీడియాలోకి తరచూ వస్తూపోతున్న విషయం తెలిసిందే. రకరకాల కారణాల చేత సంజూకు టీమిండియాలో పర్మినెంట్ పొజిషన్ దక్కడం లేదు.

Advertisement

READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌