ఐపీఎల్ 16వ సీజన్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యానాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇక ఐపీఎల్ అంటేనే వినోదాలకు పంట పండుతుంది. గ్రౌండ్ లో పరుగుల మోత మోగుతుంది. అదేవిధంగా వికెట్లు కూడా పడుతుంటాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసినటువంటి టాప్ 5 గురు బ్యాట్స్ మెన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : విరాట్ కోహ్లీ పదోతరగతి మార్కుల మెమో మీరు చూశారా ? ఎన్ని మార్కులు వచ్చాయంటే..?
Advertisement
ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో 215 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ మొత్తంగా 6,624 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో విశేషం ఏంటంటే.. కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడడం విశేషం.
Also Read : గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట విడాకులు..?
విరాట్ కోహ్లీ తరువాత ఈ లిస్ట్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కొనసాగుతున్నాడు. ధావన్ ఐపీఎల్ కెరీర్ లో 205 ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి 6,244 పరుగులు సాధించాడు. ధావన్ ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇలా రకరకాల టీమ్ లలో కొనసాగాడు.
Advertisement
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. వార్నర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడిన వార్నర్ 2016 సీజన్ లో సన్ రైజర్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు వార్నర్. ఐపీఎల్ లో మొత్తం 5,881 పరుగులు చేశాడు. ఈ పరుగుల కోసం వార్నర్ కేవలం 161 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకోవడం గమనార్హం.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాళ్లలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 222 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ 5,879 పరుగులు సాధించాడు. గత కొంత కాలంగా ముంబయి ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఈ సారి ఆడటం డౌట్ గానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సీజన్ కి ముంబయి ఇండియన్స్ కి రోహిత్ వచ్చేంత వరకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ లో టాప్ 5వ స్థానంలో కొనసాగుతున్న పరుగుల వీరుల్లో సురేష్ రైనా ఉన్నాడు. సురేష్ రైనా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడటం లేదు. ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించాడు. గత సీజన్ లో సురేష్ రైనాని ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. సురేష్ రైనా ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 200 ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 5,528 పరుగులు చేసాడు.
Also Read : డేవిడ్ వార్నర్ ను వదిలేసి… SRH పెద్ద తప్పే చేసిందిగా!