Home » పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లో ఎంతంటే ?

పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లో ఎంతంటే ?

by Anji
Ad

తమిళ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ మధ్య కాలంలో మణిరత్నం మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మణిరత్నం సినిమాలో మ్యాజిక్ తగ్గిందనే టాక్ వినిపించేది. కానీ ఆ కామెంట్ ని పీఎస్ 1 తో పక్కకు పోయేలా చేశారు దర్శకుడు మణిరత్నం. 

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?

Advertisement

ps2-review-in-telugu

టాలీవుడ్ లో అంతగా ఆకట్టుకోకపోయినా పీఎస్ 1 తమిళంలో మాత్రం సూపర్ హిట్ సాధించింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే జోష్ లో పీఎస్ 2లో దిమ్మతిరిగే వసూళ్లను కంటిన్యూ చేస్తున్నరు స్టార్ దర్శకుడు. తొమ్మిదో శతాబ్దం నాటికి చెందిన చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తమిళ సాహిత్యంలోని గొప్ప నవలల్లో ఒకటిగా భావించే పొన్నియిన్ సెల్వన్ ని రెండు భాగాలుగా మార్చి..  PS 1, PS2 గా చిత్రీకరించిన మణిరత్నం ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ని తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేసారు. విడుదల చేయడమే కాదు..  మే డే 1నుంచే సూపర్ డూపర్ టాక్ వచ్చేలా చేసుకున్నారు. 

Advertisement

Also Read :   Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!

 

అదేఊపులో.. తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 ఫిల్మ్ రికార్డులు లెవల్ కలెక్షన్లు రాబట్టుకుంటుంది. విడుదలైన మూడు రోజుల్లోనే.. మొత్తం కలిపి రూ.150 కోట్లు వసూళ్లను రాబట్టింది. నార్త్ యూఎస్ లో మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్లను వచ్చేవిధంగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.3,200 కంటే ఎక్కువ స్క్రీన్ లలో విడుదలైన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే రూ.170 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. 

Also Read :  30వెడ్స్21 అనన్య గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..!!

Visitors Are Also Reading